Metro Train Technology: మెట్రో ట్రైన్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా!
Metro Train Technology: మెట్రో ట్రైన్..... ప్రయాణికులకు చాలా సౌకర్యవంతమైన ప్రయాణ సాధనం. మరి త్వరగా, హాయిగా గమ్యస్ధానానికి చేర్చే మెట్రో రైలు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా!
Metro Train Technology: మెట్రో.... ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన నగరాలన్నింటిలో మెట్రో సర్వీసులు కీలకంగా మారాయి. ప్రయాణికులను వారి గమ్య స్థానాలను త్వరగా చేర్చడంలో మెట్రో రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దీని వలన ఎన్నో లాభాలున్నాయి. త్వరగా గమ్యం చేరవచ్చు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. ఖర్చూ తక్కువ. కాబట్టి మెట్రో సర్వీసులు అందరికీ లాభదాయకంగా మారాయి. ఇది చాలా అనుకూలమైన, సమర్ధవంతమైన, నమ్మదగిన ప్రయాణ సాధనం. అయితే ఈ మెట్రో రైలు ఎలా నడుస్తోందో, ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా! ఇప్పుడు తెలుసుకుందాం రండి.
మెట్రో పనిచేస్తుందిలా
మెట్రో రైలు విద్యుత్ శక్తితో నడుస్తుంది. మెట్రో.. డీసీ షంట్ మోటార్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు ఉంటాయి. మైక్రో కంట్రోలర్, వాయిస్ రికార్డర్ చిప్ స్పీకర్. సిస్టమ్ లో పవర్ ఆన్ చేసినప్పుడు రైలు ముందుకు కదులుతుంది. అది ఆఫ్ చేసేవరకు నడుస్తూనే ఉంటుంది. అలానే మెట్రో స్టేషన్లలో ఎన్ కోడ్ చేసిన ఆర్ ఎఫ్ ట్రాన్స్ మిటర్ ఉంటుంది. అన్ని స్టేషన్లకు ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. వాయిస్ చిప్ లో అన్ని స్టేషన్ల పేర్లు రికార్డయి ఉంటాయి. ఆ విధంగా మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామ్ ను చేస్తారు.
రైలు ఒక స్టేషన్ కు చేరినప్పుడల్లా ట్రాన్స్ మిటర్ పంపిన కోడ్ ను రైల్ రిసీవర్ తీసుకుంటుంది. అలాగే మైక్రో కంట్రోలర్ కూడా ఆ కోడ్ ను అందుకుంటుంది. కోడ్ ను అందుకున్న వెంటనే కంట్రోలర్ వాయిస్ రికార్డర్ ను అలెర్ట్ చేస్తుంది. దాంతో స్టేషన్ పేరు 6 సెకన్ల పాటు వినిపిస్తుంది. రైలు ఆగుతుంది. దాదాపు 10 సెకన్ల పాటు ఆ స్టేషన్ లో ఆగుతుంది. తర్వాత రైలు కదిలేందుకు రెండో ప్రకటన వస్తుంది. దీంతో రైలు ముందుకు కదులుతుంది.
నేటి మెట్రో చాలా ఆధునికమైనది
ప్రస్తుత మెట్రో చాలా ఆధునికమైనది. మెట్రో రైలు లోపల ఎల్ సీడీ మాడ్యూల్ అమర్చుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం ఇవి స్క్రీన్ లో స్టేషన్ పేర్లను చూపిస్తాయి. ఇది సెంట్రలైజ్డ్ ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ (CATC), ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషనల్ (ATO), ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP), ఆటోమేటిక్ ట్రైన్ సిగ్నలింగ్ (ATS) సిస్టమ్ వంటి తాజా సాంకేతికతను ఇప్పటి మెట్రో కలిగి ఉంది. ప్రకటనలు, స్టేషన్ల పేర్లు, రూట్ మ్యాపులు ఎల్ సీడీ స్క్రీన్ లో కనిపిస్తాయి.
Do you Know?
— Hyderabad Metro Rail (@hmrgov) November 16, 2022
The track gauge of Hyderabad Metro, is a Standard Gauge (1435 mm) while the state-of-the-art features involve Automatic Train Control (ATC), Automatic Train Protection (ATP) and degradation facility to Automatic Train Operation (ATO).#hydmetrorail pic.twitter.com/qb9uYImQmQ