అన్వేషించండి

AP POLYCET Toppers: ఏపీ పాలిసెట్-2024 ఫలితాల్లో 'గోదావరి' విద్యార్థుల హవా, 'టాప్' ర్యాంకులు వారికే

AP POLYCET Results: పాలిసెట్-2024 ఫలితాల్లో ఆరుగురు విద్యార్థులు 120 కి 120 మార్కులు సాధించారు. ఇందులో ఇద్దరు తూర్పుగోదావరి, ఇద్దరు పశ్చిమగోదావరి, ఇద్దురు విశాఖపట్నానికి చెందిన విద్యార్థులు ఉన్నారు.

AP POLYCET 2024 Toppers List: ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీ పాలిసెట్-2024' ఫలితాలు మే 8న వెలువడిన సంగతి తెలిసిందే. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ఫలితాల్లో ఈసారి మొత్తం 87.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్ష కోసం మొత్తం 1,42,025 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. ఇందులో 1,24,430 మంది అర్హత సాధించారు. వీరిలో బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా 50,710 (89.81%) మంది అర్హత సాధించారు. ఇక బాలురు 85,561 మంది పరీక్షకు హాజరుకాగా 73,720 (86.16%) మంది ఉత్తీర్ణులయ్యారు. 

ఆరుగురికి 120 మార్కులు..
ఫలితాల్లో 87.17 శాతం ఉత్తీర్ణతతో విశాఖపట్నం జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. 70.46 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి జిల్లా అట్టడుగున నిలిచింది. పాలిసెట్-2024 ఫలితాల్లో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో ఆరుగురు విద్యార్థులు 120 కి 120 మార్కులు సాధించారు. ఇందులో ఇద్దరు తూర్పుగోదావరి, ఇద్దరు పశ్చిమగోదావరి, ఇద్దురు విశాఖపట్నానికి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఇక ఏడుగురు విద్యార్థులు 119 మార్కులు సాధించారు. వీరిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన విద్యార్థికాగా.. తూర్పుగోదావరికి చెందిన విద్యార్థులు ఇద్దరు, పశ్చిమగోదావరికి చెందిన విద్యార్థులు నలుగురు ఉన్నారు. మొత్తంగా వీరిలో టాప్-13లో తూర్పుగోదావరి విద్యార్థులు నలుగురు, పశ్చిమగోదావరి విద్యార్థులు ఆరుగురు, విశాఖపట్నం విద్యార్థులు ముగ్గురు ఉన్నారు.  

పరీక్షలో కటాఫ్ మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీసం అర్హత మార్కులు ఉండవు.  పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 267 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కళాశాలల్లో 29 కోర్సుల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలల్లో 18,141 సీట్లు, ప్రైవేట్ కళాశాలల్లో 64,729 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఏపీ పాలిసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

పాలిసెట్ టాపర్లు వీరే..

హాల్‌టికెట్ నెంబరు విద్యార్థి పేరు జెండర్ మార్కులు ర్యాంకు జిల్లా
2701142 చల్లా నాగవెంకట సత్య శ్రీవర్షిణి  F 120  1 తూర్పుగోదావరి
2921346 పులకందం మోహిత్ క్రిష్ణసాయి  M 120 1 పశ్చిమగోదావరి
2711001 జొన్నలగడ్డ యశ్వంత్ సాయి   M 120 1 తూర్పుగోదావరి
1981132 సీలం శ్రీరామ్ భవదీప్   M 120 1 విశాఖపట్నం
1861141 పోతుల జ్ఞాన హర్షిత  F 120 1 విశాఖపట్నం
1971162  సీలం ఐశ్వర్య   F 119 7 విశాఖపట్నం
2661233  దేవ శ్రీవేద్   M 119 7 తూర్పుగోదావరి
2691360  గొల్ల ప్రభవ్ తేజ  119 7 తూర్పుగోదావరి
2971104  కాకర్ల శ్రీ సాయినాగ్   119 7 పశ్చిమగోదావరి
2981140 సిరిమల్ల లక్ష్మీ తనుష్క   F 119 7 పశ్చిమగోదావరి
2981221 రెడ్డి జీవన్   M 119 7 పశ్చిమగోదావరి
3001226  గుడ్ల సాహితి   F 119 7 పశ్చిమగోదావరి

ఏపీలో ఏప్రిల్ 27న ఎస్బీటీఈటీ పాలిసెట్-2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రాథమిక కీని ఏప్రిల్ 30న విడుదల చేశారు. ఆన్సర్ కీపై విద్యార్థుల నుంచి  మే 4 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. తుది ఆన్సర్ కీని మే 5న SBTET విడుదల చేసింది. తాజాగా పాలిసెట్ ఫలితాలను విడుదల చేసింది. త్వరలోనే పాలిసెట్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించి నుంది. కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త విద్యాసంవత్రం జూన్ 10 నుంచి ప్రారంభంకానుంది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget