అన్వేషించండి

KV Admission 2026: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు షురూ! ఎగ్జామ్‌ లేదు, ఇంటర్వ్యూ లేదు! లాటరీ ద్వారానే ఎంపిక!

KV Admission 2026: జాతీయ విద్యా విధానం ప్రకారం, పిల్లల వయసును బట్టి ఏ తరగతికి అర్హులో నిర్ణయించారు. బాల్‌వాటిక-1లో జాయిన్ అవ్వడానికి మూడేళ్లు నిండి నాలుగేళ్ల లోపు వారై ఉండాలి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
  • బాల్‌వాటిక, ఒకటో తరగతికి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మార్చి 20 నుంచి మొదలయ్యాయి.
  • ఎంపిక లాటరీ పద్ధతిలో, వయోపరిమితి కొత్త విద్యా విధానం ప్రకారం ఉంటుంది.
  • ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు, అవసరమైన పత్రాల సమర్పణ చేయాలి.

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ముఖ్యంగా చిన్న పిల్లలను స్కూల్లో చేర్పించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈసారి అడ్మిషన్లు ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఉండవు. 

అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పుడు మొదలైంది

కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బాల్‌వాటిక, ఒకటో తరగతి అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మార్చి 20 ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థుల ఎంపిక పర్తిగా పారదర్శకంగా లాటరీ పద్ధతిలలో జరుగుతుందని అధికారులు వెల్లడించారు. 

వయోపరిమితి నిబంధనలు ఇవే 

కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం, పిల్లల వయసును బట్టి ఏ తరగతికి అర్హులో నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బాల్‌వాటిక-1లో జాయిన్ అవ్వడానికి మూడేళ్లు నిండి నాలుగేళ్ల లోపు వారై ఉండాలి. బాల్‌వాటిక-2 నాలుగేళ్ల నిండి ఉండాలి. ఐదేళ్ల లోపు ఉండాలి. బాల్‌వాటిక -3లో జాయిన్ అవ్వాలంటే ఐదేళ్లు నిండి ఉండాలి, ఆరేళ్ల లోపు ఉండాలి. ఒకటో తరగతిలో జాయిన్‌ అవ్వాలంటే 6 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు ఉండాలి. 

కావాల్సిన పత్రాలు 

దరఖాస్తు చేసుకునే సమయంలో తల్లిదండ్రులు పిల్లల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో, నివాస ధ్రువీకరణ పత్రం. కులానికి సంబంధించిన సర్టిఫికేట్‌, ఆర్థికంగా వెనుకబడిన వారైతే EWS లేదా BPL సర్టిఫికెట్‌, ప్రభుత్వ ఉద్యోగులైతే సర్వీస్ సర్టిఫికెట్ లేదా ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ అవసరం అవుతాయి. 

దరఖాస్తు చేయడం ఎలా?

  • దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. మీరు సులభంగా అప్లై చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి. 
  • ముందుగా kvsangathan.nic.in లేదా kvs.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి. 
  • హోమ్‌పేజీలో కనిపించే Balvatika & Class 1 Admission 2026-27 అనే లింక్‌ మీద క్లిక్ చేయండి. 
  • మీ మొబైల్‌ నంబర్, ఈ మెయిల్‌ ఐడీ ఇచ్చి రిజిస్టర్‌ చేసుకోండి. 
  • అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన వివరాలను తప్పులు లేకుండా పూర్తి చేయాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్‌ చేసి అప్‌లోడ్ చేయండి. 
  • చివరగా ఫారమ్‌ను సబ్మిట్ చేసి, ఒక ప్రింట‌ అవుట్ తీసుకొని మీ వద్ద ఉంచుకోండి. 

లాటరీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎంపికైన విద్యార్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అప్పుడు తల్లిదండ్రులు ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించి అడ్మిషన్ ఫీజు చెల్లించి ప్రక్రియను పూర్తి చేయాలి.  

Frequently Asked Questions

కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది?

కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ మార్చి 20 ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. బాల్‌వాటిక, ఒకటో తరగతి అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ఏవైనా రాత పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఉంటాయా?

లేదు, ఈసారి కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఉండవు. విద్యార్థుల ఎంపిక పూర్తిగా లాటరీ పద్ధతిలో పారదర్శకంగా జరుగుతుంది.

బాల్‌వాటిక మరియు ఒకటో తరగతికి వయోపరిమితి నిబంధనలు ఏమిటి?

బాల్‌వాటిక-1కి 3-4 ఏళ్లు, బాల్‌వాటిక-2కి 4-5 ఏళ్లు, బాల్‌వాటిక-3కి 5-6 ఏళ్లు ఉండాలి. ఒకటో తరగతికి 6-8 ఏళ్ల లోపు ఉండాలి.

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేయడానికి ఏ పత్రాలు అవసరం?

పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), EWS/BPL సర్టిఫికెట్ (వర్తిస్తే), మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్/ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ అవసరం.

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget