News
News
వీడియోలు ఆటలు
X

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

దేశవ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) షెడ్యూల్‌ను విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

దేశవ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు మార్చి 21న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి మార్చి 27న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చి 31 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే రెండో తరగతి ప్రవేశాల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగియనుంది. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒకటోతరగతిలో ప్రవేశాలకు విద్యార్థులకు 31.03.2023 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 

తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టు  నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు.

ముఖ్యమైన తేదీలు...

షెడ్యూలు వెల్లడి: 21.03.2023

నోటిఫికేషన్ వెల్లడి: 25.03.2023.

* క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27.03.2023. (ఉ.10.00 గం. నుంచి)

➥ క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 17.04.2023. (సా. 7.00 గం. వరకు)

➥ ఎంపిక జాబితా వెల్లడి: 20.03.2023 (లిస్ట్-1), 28.03.2023 (లిస్ట్-2), 04.05.2023 (లిస్ట్-3).

➥ సెకండ్ నోటిఫికేషన్ (ఎక్స్‌టెండెడ్ తేదీ): 

నోటిఫికేషన్-2 (ఎక్స్‌టెండెడ్): 03.05.2023.

➥ రిజిస్ట్రేషన్: 04.05.2023 - 11.05.2023.

➥ ఎంపికజాబితా వెల్లడి: 18.05.2023 - 25.05.2023.

* క్లాస్-2, ఆపై తరగతులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం (క్లాస్-11 మినహాయించి): 03.04.2023 - 12.04.2023. 

➥ ఎంపిక జాబితా వెల్లడి: 17.04.2023.

➥ ప్రవేశాలు: 18.04.2023 - 29.04.2023.

➥ ప్రవేశాలు పొందడానికి చివరితేది: 30.06.2023.

➥ క్లాస్-11 (కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 10 రోజుల తర్వాత నుంచి.

➥ కేవీ క్లాస్-11 ఎంపిక జాబితా: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 20 రోజుల తర్వాత నుంచి.

➥క్లాస్-11 (నాన్-కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్, ఎంపిక జాబితా, ప్రవేశాలు: కేవీ విద్యార్థులు ప్రవేశ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇతర విద్యార్థులకు ప్రవేశాలకు కల్పిస్తారు.

➥ క్లాస్-11లో ప్రవేశాలు పొందడానికి చివరితేది: పదోతరగతి ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి 30 రోజుల వరకు.  

Admission Guidelines

Admission Schedule

Website

Also Read:

ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీలో ఏప్రిల్‌లో నిర్వహించనున్న ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసింది. పరీక్షల హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 17 వరకు టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి 23 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ-2023)‌ నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. పరీక్ష షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నారు. 
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 22 Mar 2023 09:37 AM (IST) Tags: Education News in Telugu Kendriya Vidyalaya Sangathan Kendriya Vidyalaya Hyderabad Admission 2023 KVS Admission 2023-24 Kendriya Vidyalaya School Admissions

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

NLSIU Courses: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!

NLSIU Courses: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!