By: ABP Desam | Updated at : 25 Apr 2023 05:20 AM (IST)
Edited By: omeprakash
జేఈఈ మెయిన్ సెషన్-2 ఆన్సర్ కీ ( Image Source : ABP Live )
జేఈఈ మెయిన్ 2023 సెషన్-2 పరీక్ష ఆన్సర్ కీని ఏప్రిల్ 24న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఫైనల్ ఆన్సర్ కీ వెలువడిన నేపథ్యంలో ఏ క్షణమైనా పరీక్ష ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసే అవకాశం ఉంది.
ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష జరగ్గా.. 9లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు.. ఏప్రిల్ 21వరకు అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. అభ్యంతరాలను పరిశీలించిన ఎన్‌టీఏ అధికారులు తాజాగా తుది సమాధానాల కీని విడుదల చేశారు. అయితే, ఇప్పటివరకు ఫలితాల విడుదల తేదీపై ఎన్‌టీఏ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
జేఈఈ మెయిన్ ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి..
Also Read:
ADCET 2023: ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వివిధ ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఆర్ట్ & డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏడీసెట్)-2023' నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడిజైన్ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాాగా.. మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
డీఈఈసెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' (డీఎడ్) నోటిఫికేషన్ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
టెక్నికల్ టీచర్స్ కోర్సుకు దరఖాస్తులు స్వీకరణ, చివరితేది ఎప్పుడంటే?
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్సుకు (టీసీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కోర్సుకు సంబంధించిన శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు.ఆయా జిల్లా డీఈఓలను సంప్రదించి దరఖాస్తు ప్రక్రియ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. మే 1 నుంచి జూన్ 11 వరకు కోర్సు శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఏప్రిల్ 21 నుంచి 30 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్ల పేర్కొన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?
NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఎన్టీఆర్ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?