అన్వేషించండి

JEE Syllabus: జేఈఈ మెయిన్ సిలబస్‌ తగ్గింపు - ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితంలో పలు పాఠ్యాంశాలు తొలగింపు

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈసారి పరీక్షలో సిలబస్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితంలోని పలు అంశాలను తొలగించింది.

జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నవంబరు 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు పరీక్ష సిలబస్‌ను ఎన్టీఏ ప్రకటించింది. ఈసారి పరీక్షలో సిలబస్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితంలోని పలు అంశాలను తొలగించింది. ముఖ్యంగా కెమిస్ట్రీ సబ్జెక్టులో పలు పాఠ్యాంశాలను(25 శాతం సిలబస్‌‌ను) పూర్తిగా తొలగించింది. ఇక ఫిజిక్స్‌లో మొత్తం 14 అంశాలను తొలగించింది. ఇందులో న్యూటన్స్‌ లా ఆఫ్‌ కూలింగ్‌, కార్టన్‌ ఇంజిన్‌ అండ్‌ ఎఫిషియెన్సీ, డాప్లర్‌ ఎఫెక్స్‌ ఇన్‌ సౌండ్స్‌, ఫోర్స్‌డ్‌ & డంపుడ్‌ ఆస్కిలేషన్‌ తదితర అంశాలు ఉన్నాయి. ఇక కెమిస్ట్రీలో 25 శాతం సిలబస్‌ను, మ్యాథమెటిక్స్‌లో రెండు అంశాలను తొలగించినట్టు ఎన్టీఏ వెల్లడించింది. కరోనా కాలంలో సీబీఎస్‌ఈ విద్యార్థులకు 9, 10 తరగతులతోపాటు ఇంటర్‌ లేదా తత్సమాన తరగతిలో సిలబస్‌ తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మేరకు జేఈఈ మెయిన్‌ సిలబస్‌లోనూ మార్పులు చేశారు. విద్యార్థులపై భారం తగ్గించేందుకు సిలబస్ తగ్గించారు. 

JEE Mains 2024 Syllabus

➥ మ్యాథమెటిక్స్‌లో తొలిగించిన పాఠ్యాంశాలు

  • మ్యాథమెటికల్ ఇండక్షన్స్
  • మ్యాథమెటికల్ రీజనింగ్
  • త్రీ డైమెన్షనల్ జియోమెట్రీలో పలు అంశాలు

➥ ఫిజిక్స్‌లో తొలిగించిన పాఠ్యాంశాలు

  • కమ్యూనికేషన్ సిస్టమ్స్
  • న్యూటన్స్‌ లా ఆఫ్‌ కూలింగ్‌ 
  • కార్టన్‌ ఇంజిన్‌ అండ్‌ ఎఫిషియెన్సీ
  • డాప్లర్‌ ఎఫెక్స్‌ ఇన్‌ సౌండ్స్‌ 
  • ఫోర్స్‌డ్‌ అండ్‌ డంపుడ్‌ ఆస్కిలేషన్‌ తదితర అంశాలు

➥ కెమిస్ట్రీతో తొలిగించిన పాఠ్యాంశాలు

  • ఫిజికల్ క్వాంటిటీస్ & మెజర్‌మెంట్స్ 
  • ప్రెసిషన్, అక్యురసీ, సిగ్నినిఫికెంట్ ఫిగర్స్ 
  • స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్
  • థామ్సన్ & రూథర్‌ఫోర్డ్స్ అటామిక్ మోడల్స్, లిమిటేషన్స్
  • సర్ఫేస్ కెమిస్ట్రీ
  • ఎస్-బ్లాక్ ఎలిమెంట్స్
  • జనరల్ ప్రిన్సిపుల్స్, ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్ ఆఫ్ మెటల్స్
  • హైడ్రోజన్
  • ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ
  • పాలిమర్స్
  • కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్

జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం...

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు ప్రకారం నవంబరు 1న ప్రారంభంకావాల్సి ఉండగా... నవంబరు 2న ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ద్వారా నవంబర్‌ 30న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. 

జనవరిలో సెషన్‌-1, ఏప్రిల్‌లో సెషన్‌-2
జేఈఈ పరీక్షలు రెండు విడతలుగా నిర్వహిస్తారు. జనవరిలో మొదటివిడత, ఏప్రిల్‌లో రెండోవిడత పరీక్షలు ఉంటాయని నోటిఫికేషన్‌లో ప్రకటించింది. నవంబరు 30న రాత్రి 9గంటల వరకు జేఈఈ మొదటివిడత పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు మొదటివిడత పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఫిబ్రవరి 12న ఫలితాలు ఇవ్వనున్నట్టు ఎన్‌టీఏ స్పష్టం చేసింది. జేఈఈ రెండోవిడత పరీక్షలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందని ఎన్టీఏ తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఏప్రిల్‌ 25న ఫలితాలు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.

రాష్ట్రంలో 11 కేంద్రాల్లో పరీక్షలు
తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌తోపాటు ఏపీలోని 30 కేం ద్రాల్లో పరీక్షలు ఉన్నట్టు వివరించారు. పరీక్షలు తె లుగు, ఇంగ్లిష్‌తో సహా మొత్తం 10 భాషల్లో నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి, మధ్యాహ్నం 3 గంటల నుంచి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. 2022, 2023, 2024 విద్యా సంవత్సరాల్లో ఇంటర్మీయట్‌ 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. సందేహాలుంటే 011040759000 నంబర్‌ను సంప్రదించాలని ఎన్టీఏ తెలిపింది.

నోటిఫికేషన్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Small Saving Schemes: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Komatireddy Venkat Reddy: నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Embed widget