NTA JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
NTA JEE Main 2022 Result: ప్రొవిజనల్ ఫైనల్ కీని విడుదల చేసిన ఎన్‌టీఏ తాజాగా జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 ఫలితాలు విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ర్యాంకు కార్డులను అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆదివారం ప్రొవిజనల్ ఫైనల్ కీని విడుదల చేసిన ఎన్‌టీఏ తాజాగా జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 ఫలితాలు విడుదల చేసింది. జులై 25 నుంచి 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు.
NTA JEE Main Result 2022: Direct Link 1
NTA JEE Main 2022 Result: Direct Link 2
JEE మెయిన్స్ ఫలితాలను 2022 ఇలా చెక్ చేసుకోండి..
అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in ను సందర్శించండి.
హోమ్ పేజీలో JEE మెయిన్స్ ఫలితాలు సెషన్ 2 లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి
మీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి
మీ రిజల్ట్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఆ పీడీఎఫ్ రిజల్ట్ ఫైల్‌ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోవడం బెటర్
అంతకుముందు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన యశ్వంత్, ఏపీకి చెందిన ఆదినారాయణ పి, కే సహాస్, పి రవిశంకర్ 100 పర్సంటైల్ సాధించడం విశేషం.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) 2022
ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) ఎంతో కీలకం. తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభ దశలో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. ఇక భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్ (JEE Main Results) ఫలితాల తర్వాత అప్లికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Also Read: JEE Advanced 2022 registration : నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్, ఇలా దరఖాస్తు చేసుకోండి!
జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి 11లోపు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 28న అడ్వాన్స్‌డ్ పేపర్–1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ తుది ఫలితాలను సెప్టెంబర్ 11న ప్రకటించాలని నిర్ణయించారు.
Also Read: TS EAMCET Results: టీఎస్ ఎంసెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
IIT బాంబే JEE అడ్వాన్స్‌డ్ 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆదివారం ప్రారంభించనుంది. అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో JEE అడ్వాన్స్‌డ్ 2022 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను ఆగస్టు 23వ తేదీ నుంచి ఆగస్టు 28 వరకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్ సైట్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.