అన్వేషించండి

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీ విడుద‌ల‌.. డైరెక్ట్ లింక్ ఇదే..

జేఈఈ అడ్వాన్స్ 2021 ప‌రీక్ష కీ విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్‌లు ఇప్పటికే విడుద‌లయ్యాయి. రెస్పాన్స్ షీట్, కీ ఆధారంగా విద్యార్థులు త‌మ ర్యాంక్‌ను అంచ‌నా వేసుకోవ‌చ్చు.

దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కీ విడుదలైంది. కీపై అభ్యంతరాలు తెలిపేందుకు విద్యార్థులకు అవకాశం ఇచ్చింది. విద్యార్థులు రేపు (అక్టోబర్‌ 11) సాయంత్రం 5 గంటల వరకు కీపై అభ్యంతరాలు వెల్లడించవచ్చు. అభ్యంత‌రాల‌కు సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్‌లు సైతం ఇటీవల విడుదల అయ్యాయి. పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ ఆధారంగా విద్యార్థులు తమ స్కోర్ వివరాలు తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా తమ ర్యాంక్‌ను సైతం అంచ‌నా వేసుకోవచ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్‌ (IITK) నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు వీలు కల్పించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు అక్టోబ‌ర్ 15వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: నేటితో ముగియనున్న నీట్ యూజీ సవరణలు.. ఇవి చేయడం మర్చిపోకండి.. 

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 ఆన్సర్ కీని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..  
1. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.inను ఓపెన్ చేయండి. 
2. హోం పేజీలో ఆన్సర్ కీ లింక్ మీద క్లిక్ చేయండి. ఇందులో డౌన్‌లోడ్ సెక్షన్ ఎంచుకోండి. 
3. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు అందించాలి. 
4. ఆన్సర్ కీ వివరాలు చూడటానికి అక్కడ ఉన్న డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. 

(ఆన్సర్ కీ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

స్కోర్ ఇలా అంచనా వేసుకోండి.. 
1. రెస్పాన్ షీట్ డౌన్‌లోడ్ చేసుకున్న త‌ర్వాత జ‌వాబు కీతో సరిపోల్చుకోండి.
2. కరెక్టు జవాబుకి మార్కు వేసుకోండి. 
3. తప్పు జవాబుకి నెగిటివ్ మార్కు వేసుకోండి. 
4. ఈ రెండు ఫలితాలను సరిపోల్చుకుంటే పరీక్షలో వచ్చిన స్కోర్ లభిస్తుంది.

Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాల‌ర్‌షిప్‌.. ఏడాదికి రూ.38,500 సాయం.. 

యూజీసీ నెట్ మళ్లీ వాయిదా.. 
యూజీసీ నెట్ (UGC NET) 2021 పరీక్షలు వాయిదా పడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ పరీక్షలు అక్టోబర్ 17వ తేదీ నుంచి మొదలు కావాల్సి ఉంది. డిసెంబర్ 2020, జూన్ 2021 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఒకసారి వాయిదా పడగా.. తాజాగా మరోసారి వాయిదా పడింది. ఎన్టీఏ మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ పరీక్షలు అక్టోబర్‌ 6 నుంచి 11 వరకు జరగాల్సి ఉంది. ఈ తేదీల్లో ఇతర ముఖ్యమైన పరీక్షలు ఉండటంతో తేదీలను సవరించింది. అక్టోబర్ 17 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కోవిడ్ కారణంగా యూజీసీ నెట్ పరీక్షలను మరోసారి వాయిదా వేసింది. 

Read More: అభ్యర్థులకు అలర్ట్.. యూజీసీ నెట్ మళ్లీ వాయిదా.. త్వ‌ర‌లో కొత్త తేదీల ప్ర‌క‌టన..

Also Read: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget