అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

JEE Advance Toppers: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో 26.17 శాతం ఉత్తీర్ణత, తెలుగు ర్యాంకర్లు వీరే!

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షలో మొత్తం 26.17 శాతం విద్యార్థులు అర్హత సాధించారు.1,55,538 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 40,712 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు సెప్టెంబరు 11న విడుదలయ్యాయి. ఐఐటీ బాంబే ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు/లేదా వ్యక్తిగత వివరాలను నమోదు చేసి JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలను చూసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు ఆల్ ఇండియా టాపర్స్, ఇతర వివరాలను కూడా విడుదల చేసింది. ఫలితాలతోపాటు తుది ఆన్సర్ కీని కూడా విడుదల చేశారు.  

JEE Advanced 2022 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..


26.17 శాతం విద్యార్థులు మాత్రమే అర్హత..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షలో మొత్తం 26.17 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. పేపర్-1, పేపర్-2 పరీక్షలకు మొత్తం 1,60,038 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకోగా.. 1,55,538 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 40,712 మంది విద్యార్థులు అర్హత సాధించారు. గతేడాది 30 శాతం ఉత్తీర్ణులు కాగా.. ఈసారి ఉత్తీర్ణత శాతం 4 శాతం తగ్గింది. కటాఫ్ మార్కులను జనరల్ 88.41, ఈడబ్ల్యూఎస్ - 63.11, ఓబీసీ- 67, ఎస్సీ-43.08, ఎస్టీ-26.70 గా నిర్ణయించారు. 


సత్తాచాటిన తెలుగు విద్యార్థులు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆర్కే శిశిర్ టాపర్‌గా నిలిచారు. శిశిర్ 360 మార్కులకు గానూ 314 మార్కులు సాధించారు. శిశిర్ ఐఐటీ బాంబే జోన్‌కు చెందినవారు.  జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన హైదరాబాద్‌కు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో జాతీయస్థాయి రెండో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తెలంగాణ ఎంసెట్‌లో మూడోర్యాంకు సాధించిన విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయ జేఈఈ ఫలితాల్లో 6వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. వంగపల్లి సాయిసిద్దర్థ 4వ ర్యాంకు సాధించాడు. తెలంగాణకే చెందిన ధీరజ్ కురుకుండ 8వ ర్యాంకులో నిలిచాడు. టాప్-10లో 2, 3, 4, 6, 8 ర్యాంకులు మద్రాస్ జోన్‌కు చెందిన విద్యార్థులే కైవసం చేసుకోవడం గమనార్హం.   

Also Read:  JoSAA 2022 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు ఇదే!


టాప్-10 ర్యాంకర్లు వీరే...

1. ఆర్.కె. శిశిర్ 
2. పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి (తెలంగాణ)
3. థామస్ బిజు చీరంవెలిల్ 
4. వంగపల్లి సాయి సిద్దార్థ (ఏపీ)
5. మయాంక్ మోత్వానీ 
6. పోలిశెట్టి కార్తికేయ (ఏపీ)
7. ప్రతీక్ సాహూ 
8. ధీరజ్ కురుకుండ (తెలంగాణ)
9. మహిత్ గధివాలా 
10. వెట్చా జ్ఞానమహేశ్ 

జాతీయస్థాయిలో కేటగిరీలవారీగా టాపర్లు జాబితా పరిశీలిస్తే.. మొత్తం 10 విద్యార్థులు టాప్-1 ర్యాంకు సాధించడం విశేషం. వీరిలో ఐఐటీ బాంబే జోన్‌లో నలుగురు, ఐఐటీ మద్రాస్ జోన్‌లో నలుగురు, ఐఐటీ ఢిల్లీ జోన్‌, ఐఐటీ గువాహటి జోన్ల పరిధిలో ఒక్కోక్కరి చొప్పున ఉన్నారు. 

కేటిగిరీలవారీగా టాప్-1 ర్యాంకు సాధించిన 10 మంది విద్యార్థులు వీరే..

1.ఆర్.కె. శిశిర్ (ఐఐటీ బాంబే)-CRL
2. వంగపల్లి సాయి సిద్దార్థ (ఐఐటీ మద్రాస్)- OBC-NCL
3. పొలిశెట్టి కార్తికేయ (ఐఐటీ మద్రాస్)- Gen-EWS
4. దయ్యాల జాన్ జోసెఫ్(ఐఐటీ మద్రాస్)- SC
5. లోవెశ్ మెహర్(ఐఐటీ ఢిల్లీ)-ST
6. ఓజస్ మహేశ్వరీ (ఐఐటీ బాంబే)-Gen-PWD
7. గైకోటి విగ్నేష్ (ఐఐటీ మద్రాస్) - Gen-EWS-PWD
8. ఓంకార్ రమేశ్ సిర్పూర్ (ఐఐటీ బాంబే)-OBC-NCL-PWD
9. ప్రకాశ్ ఎస్ రా థోడ్ (ఐఐటీ బాంబే)-SC-PWD
10. తాడర్ సిమి (ఐఐటీ గువాహటి)-ST-PWD


ఐఐటీ ఢిల్లీ జోన్ టాపర్లు:
1. మయాంక్ మోత్వానీ - CRL 5
2. తనిష్క్ కాబ్రా - CRL 16
3. సాక్ష్యం రతీ -  CRL 18
4. నవ్య -  CRL 20
5. హర్షకుమార్ - CRL 21


ఐఐటీ బాంబే జోన్ టాపర్లు:
1. ఆర్‌.కె. శిశిర్ - CRL 1
2. ప్రతీక్ సాహూ - CRL 7
3. మహిత్ గధివాలా - CRL 9
4. విశాల్ బైసానీ - CRL 13
5. హరిహంత్ వశిష్ట - CRL 17


ఐఐటీ మద్రాస్ జోన్ టాపర్లు:

1. పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి - AIR 2
2. థామస్ బిజు చీరంవెలిల్ - AIR 3
3. వంగపల్లి సాయిసిద్ధార్థ - AIR 4
4. పోలిశెట్టి కార్తికేయ - AIR 6
5. ధీరజ్ కురుకుండ - AIR 8

ఐఐటీ రూర్కీ జోన్ టాపర్లు: 
1. CRL 19 - మ్రినాల్ గార్గ్ 
2. CRL 29 - సౌమిత్రా గార్గ్ 
3. CRL 38 - గౌరిష్ గార్గ్
4. CRL 42 - చిన్మయ్ ఖోకర్ 
5. CRL 48 - హర్ష్ జఖర్ 


ఐఐటీ భువనేశ్వర్ జోన్ టాపర్లు:
1. వెట్చా జ్ఞాన మహేశ్ - AIR 10
2. దివ్యాంశు మాలు - AIR 11
3. సూర్యాన్స్ శ్రీజన్ - AIR 51
4. తనీష్ అగర్వాల్ - AIR 57
5. ఆదిత్యప్రకాశ్ - AIR 70

ఐఐటీ కాన్పూర్ జోన్ టాపర్లు:
1. కనిష్క్ శర్మ - AIR 58
2. అతర్వ్ మోఘే - AIR 170
3. కనక్ బర్ఫా - AIR 189
4. అర్వింద్ కుమార్ యాదవ్ - AIR 192
5. హర్షిత్ శ్రీవాత్సవ - AIR 215

ఐఐటీ గువాహటీ జోన్ టాపర్లు:
1. అభిజిత్ ఆనంద్ - CRL 15
2. శివం సావర్న్ -  CRL 65
3. ఆదిత్య అజయ్ - CRL 188
4. హిమాన్షు శేఖర్ - 193
5. పార్థివ్ సేన్ - 195

మహిళల విభాగంలో టాపర్లు..
1. జలధి జోషి - CRL 32
2. తనిష్క కాబ్రా - CRL 16
3. స్నేహ పరీక్- CRL 447
4. ప్రగతి అగర్వాల్ - CRL 545
5. జాహ్నవి షా - CRL 258
6. పల్లి జలజాక్షి - CRL 24
7. విధూషి - CRL 440

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Devaki Nandana Vasudeva: మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే డిజాస్టర్ టాక్, షోస్ క్యాన్సిల్
మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే డిజాస్టర్ టాక్, షోస్ క్యాన్సిల్
Crime News: గుర్తు తెలియని యువతి నుంచి వీడియో కాల్ - కూల్‌గా మాట్లాడి కొంపముంచింది, చివరకు!
గుర్తు తెలియని యువతి నుంచి వీడియో కాల్ - కూల్‌గా మాట్లాడి కొంపముంచింది, చివరకు!
Hindu Temples: దేవుడు ప్రతిచోటా ఉన్నాడు కదా..ఆలయాలకు ఎందుకు వెళ్లాలి - వెళ్లకపోతే భక్తి లేనట్టేనా!
దేవుడు ప్రతిచోటా ఉన్నాడు కదా..ఆలయాలకు ఎందుకు వెళ్లాలి - వెళ్లకపోతే భక్తి లేనట్టేనా!
Embed widget