అన్వేషించండి

JEE Advanced Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ 'కీ' వచ్చేసింది, అభ్యంతరాలుంటే తెలపండి!

ఆన్సర్‌ 'కీ'తోపాటు విద్యార్థుల సౌలభ్యం కోసం పరీక్ష ప్రశ్నపత్రాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబరు 4న సాయంత్రం 5 గంటల్లోగా తెలపాల్సి ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష ఆన్సర్ 'కీ'ని ఐఐటీ బాంబే సెప్టెంబరు 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ 'కీ'ని అందుబాటులో ఉంచింది. ఆన్సర్‌ 'కీ'తోపాటు విద్యార్థుల సౌలభ్యం కోసం పరీక్ష ప్రశ్నపత్రాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇప్పటికే విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను (ఆన్సర్ షీట్) అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబరు 5న సాయంత్రం 5 గంటల్లోగా ఆన్‌లైన్ ద్వారా తెలపాల్సి ఉంటుంది.

Answer Key: https://jeeadv.ac.in/documents/provisional-answer-keys.pdf


అభ్యంతరాలు తెలపడానికి:  https://cportal.jeeadv.ac.in/

అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్ (సమాధాన పత్రాలు): https://cportal.jeeadv.ac.in/

జేఈఈ అడ్వాన్స్డ్ 2022 పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. లాగిన్ డీటైల్స్తో తమ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెస్పాన్స్ షీట్, ప్రొవిజనల్ ఆన్సర్ కీని పరిశీలించిన తర్వాత.. అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ తుది ఆన్సర్ కీ, ఫలితాలు.. సెప్టెంబరు 11న ఉదయం 10 గంటలకు వెలువడనున్నాయి.


ఈ ఏడాది ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు జేఈఈ మెయిన్ లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1.5 లక్షల మంది హాజరయ్యారు. ఏపీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న 15 వేల మందిలో 90 శాతం మంది పరీక్షకు హాజరైనట్టు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 30 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఐఐటీ ఖరగ్పూర్ జేఈఈ అడ్వాన్స్ డ్–2021 నిర్వహించింది.


11న ఫైనల్ కీ..
అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు సంబంధిత వెబ్సైట్లో ఈనెల 5నుంచి అందుబాటులో ఉంటాయి. సెప్టెంబరు11న ఉదయం 10 గంటలకు ఫలితాలతోపాటు తుది కీని ప్రకటించనున్నారు. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) అక్టోబర్ 18న నిర్వహిస్తారు. వీటి ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు.


12 నుంచి కౌన్సెలింగ్
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలును ఐఐటీ బాంబే ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 12 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారికి ఆగ‌స్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 11న వెల్లడిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. అయితే సెప్టెంబరు 20 వరకు అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉంటుందని.. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుందని ఐఐటీ బాంబే తెలిపింది. సెప్టెంబరు 21 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించింది. మొత్తం 6 రౌండ్ల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐఐటీ బాంబే విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే అక్టోబరు 16 నుంచి 21 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మరోవైపు సీట్ల భర్తీ నియమ నిబంధనలను కూడా ప్రకటించింది. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.
 

JoSAA కౌన్సెలింగ్ ఇలా..
♦ 1వ రౌండ్‌ : సెప్టెంబరు 23 నుంచి 27 వరకు
♦ 2వ రౌండ్‌: సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు
♦ 3వ రౌండ్‌: అక్టోబరు 3 నుంచి 7 వరకు
♦ 4వ రౌండ్‌: అక్టోబరు 8 నుంచి 11 వరకు
♦ 5వ రౌండ్‌: అక్టోబరు 12 నుంచి 15 వరకు
♦ 6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16 నుంచి 17 వరకు నిర్వహిస్తారు. 

6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:

♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23న
♦ 2వ రౌండ్‌: సెప్టెంబరు 28వ తేదీ
♦ 3వ రౌండ్‌: అక్టోబరు 3
♦ 4వ రౌండ్‌: 8వ తేదీ
♦ 5వ రౌండ్‌: 12వ తేదీ
♦ 6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16న

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget