అన్వేషించండి

VSKP IIPE Btech: విశాఖపట్నం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో బీటెక్‌ ప్రోగ్రామ్

IIPE Admissions: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో బీటెక్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఇంటర్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.

Indian Institute of Petroleum and Energy BTech Admissions 2024 : విశాఖపట్నంలోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE)' 2024 సంవత్సరానికిగాను బీటెక్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 165 సీట్లలో నాలుగేళ్ల కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు.  కనీసం 75 శాతం మార్కులతో ఇంటర్ విద్యార్హతతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్-2024లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.

సరైన అర్హతలున్నవారు జూలై 5 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశాలు పొందినవారికి ఆగస్టు 5 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ 2024 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతిభావంతులైన మహిళా విద్యార్థులకు నెలకు రూ.3000 స్కాలర్‌షిప్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు మినహాయింపులు అందిస్తారు.

వివరాలు..

* బీటెక్ ప్రోగ్రామ్‌

కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.

సీట్ల సంఖ్య: 165.

➥ పెట్రోలియం ఇంజినీరింగ్: 62 సీట్లు

➥ కెమికల్ ఇంజినీరింగ్: 63 సీట్లు

➥ మెకానికల్ ఇంజినీరింగ్: 40 సీట్లు

అర్హత: కనీసం 75 శాతం మార్కులతో ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. దీంతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్-2024లో అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: జేఈఈ-అడ్వాన్స్‌డ్ 2024 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.

ముఖ్యమైన తేదీలు...

⫸ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.06.2024.

⫸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.07.2024.

⫸ మొదటి రౌండ్‌ సీట్ల అలాట్‌మెంట్‌ లిస్ట్‌ విడుదల: 06.07.2024.

⫸ మొదటి రౌండ్‌లో ఎంపికైనవారు అడ్మిషన్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 10.07.2024

⫸ రెండో రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: 11.07.2024.

⫸ రెండో రౌండ్‌ అభ్యర్థులు అడ్మిషన్‌ ఫీజు చెల్లించేందుకు చివరితేదీ: 15.07.2024.

⫸ మొదటి, రెండో రౌండ్ ప్రవేశాల విత్‌డ్రాకు చివరితేది: 18.07.2024.

⫸ మూడో రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: 19.07.2024.

⫸ మూడో రౌండ్‌ అభ్యర్థులు అడ్మిషన్‌ ఫీజు చెల్లించేందుకు చివరితేదీ: 22.07.2024.

⫸ మూడో రౌండ్ ప్రవేశాల్లో విత్‌డ్రాకు చివరితేది: 24.07.2024.

⫸ ఫిజికల్ రిజిస్ట్రేషన్ (సెల్ఫ్ రిపోర్టింగ్): 25.07.2024.

⫸ నాలుగో రౌండ్‌ జాబితా విడుదల: 26.07.2024.

⫸ నాలుగో రౌండ్ ఫీజు పూర్తిగా చెల్లించేందుకు చివరితేదీ: 30.07.2024.

⫸ ఫిజికల్ రిజిస్ట్రేషన్ (సెల్ఫ్ రిపోర్టింగ్): 02.08.2024.

⫸ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌: 05.08.2024.

⫸ అకడమిక్‌ సెషన్‌ ప్రారంభం: 05.08.2024.

Notification

Online Application

Website

ALSO READ:

ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు, టెన్త్ పాసైతే చాలు
విజయవాడలోని ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ 2024-25 విద్యాసంవత్సరానికిగాను రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా యూనివర్సిటీ పరిధిలో మొత్తం 495 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన పరీక్షల్లో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Embed widget