అన్వేషించండి

HDFC Badhte Kadam Scholarship: 'బడ్తే కదమ్ స్కాలర్‌షిప్‌'తో విద్యార్థుల చదువులు ముందుకు

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందుతోంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఇంటర్ లేదా డిగ్రీ చదువుతూ, పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉద్దేశించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి కింది స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్ పథకం ద్వారా సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందుతోంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఇంటర్ లేదా డిగ్రీ చదువుతూ, పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉద్దేశించింది. ఇంటర్ నుంచి డిగ్రీ చదివే భారతీయ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తంగా 5 రకాల కేటగిరీలుగా స్కాలర్‌షిప్ అందజేస్తారు. వీటిలో 10, 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులు, జనరల్ డిగ్రీ విద్యార్థులు, ప్రొఫెషనల్ డిగ్రీ విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులు, పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేస్తారు.

ఇంటర్, డిగ్రీ, డిప్లొమా/ఐటీఐ, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్, జేఈఈ, క్లాట్, ఎన్‌ఐఎఫ్‌టీ లాంటి ప్రవేశపరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు అకడమిక్ పరీక్షలొ కనీసం 80 శాతం మార్కులు కలిగి ఉండాలి.

Also Read:  బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!

కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. దివ్యాంగులైతే రూ.8 లక్షలకు మించకూడదు. ఏ విధమైన సంక్షోభంలో (సింగిల్ పేరెంట్, అనాదలు, కుటుంబంలో ప్రాణాంతక అనారోగ్యం,etc.) ఉన్న విద్యార్థులకు ప్రత్యేక పరిగణలోకి తీసుకుంటారు.

స్కాలర్‌షిప్ మొత్తం:  10, 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రూ.18,000; జనరల్ డిగ్రీ విద్యార్థులకు రూ.30,000; ప్రొఫెషనల్ డిగ్రీ విద్యార్థులకు రూ.1,00,000; దివ్యాంగ విద్యార్థులకు (10, 12 తరగతులు, ఐటీఐ, డిప్లొమా) విద్యార్థులకు రూ.24,000, పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు రూ.72,000 స్కాలర్‌షిప్‌గా ఇస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

చివరితేది: 30-09-2022.

Notification & Online Aplication  

 

 Also Read: పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?

 

పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి కింది స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్ పథకం ద్వారా సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందుతోంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 1వ తరగతి నుండి డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్‌లను అభ్యసించే పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించింది. 

HDFC ECS స్కాలర్‌షిప్ పథకం కింద, వ్యక్తిగత/కుటుంబ సంక్షోభం లేదా ఏదైనా ఇతర ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు అయ్యే ఖర్చును భరించలేక, ఆగిపోయే ప్రమాదం ఉన్న విద్యార్థులకు వారి చదువుల కోసం రూ.75,000 వరకు ఆర్థిక సహాయం అందుతోంది. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ అయిన HDFC బ్యాంక్, తన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ - ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ (ECS)లో భాగంగా ఈ స్కాలర్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. బ్యాంక్ తన సామాజిక చొరవ - పరివర్తన్‌లో భాగంగా విద్య మరియు జీవనోపాధి శిక్షణ రంగంలో వివిధ ప్రాజెక్టులను చేపడుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Embed widget