అన్వేషించండి

TS PGECET Exam: టీఎస్‌ పీజీఈసెట్‌ నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీల వివరాలు..

TS Post Graduate Engineering Common Entrance Test: తెలంగాణ స్టేట్ పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2021 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు గడువు, పరీక్ష తేదీల వివరాలు..

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన తెలంగాణ స్టేట్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీఎస్ పీజీఈసెట్‌) - 2021 నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం టీఎస్ పీజీఈసెట్ దరఖాస్తు ప్రక్రియ ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 5 వరకు కొనసాగనుంది. ఆలస్య రుసుము రూ.250తో జూలై 15 వ తేదీ వరకు, రూ.1000తో జూలై 22 వరకు, రూ.2500తో జూలై 30 వరకు, రూ.5000తో ఆగస్టు 7 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలిపింది. టీఎస్ పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు  https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది.  

టీఎస్ పీజీఈసెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచి ప్రారంభమైంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో దరఖాస్తు గడువును పలుమార్లు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పేర్కొంది. పీజీఈసెట్ ద్వారా గేట్ జీప్యాట్ విద్యార్థులకు ఎంఈ / ఎంటెక్ / ఎంఫార్మా / ఎంఆర్క్ / గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పీజీఈసెట్‌ను 19 (ఫార్మసీతో కలిపి) పేపర్లలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు బీటెక్‌లో తాము చదివిన బ్రాంచ్‌ ఆధారంగా సంబంధిత పేపర్లలో పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. 
ముఖ్యమైన వివరాలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test - CBT) ద్వారా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500, ఇతరులు రూ.1000 చెల్లించాలి. 
దరఖాస్తు చివరి తేది: జూలై 5, 2021 (ఆలస్య రుసుము లేకుండా)
వెబ్‌సైట్‌: https://pgecet.tsche.ac.in/ 
టీఎస్ పీజీఈసెట్ పరీక్షల తేదీ: ఆగస్టు 11 నుంచి 14 వరకు 
పరీక్ష విధానం: ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు (మల్టిపుల్ చాయిస్) ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కటాఫ్ మార్కులు 30గా నిర్ణయించారు. ఎస్సీ / ఎస్టీలకు కటాఫ్ మార్కులు ఉండవు. పరీక్ష రెండు గంటల పాటు నిర్వహిస్తారు. పీజీఈసెట్‌లో అడిగే ప్రశ్నలు అన్నీ కూడా బీటెక్‌ స్థాయిలో ఉంటాయి.  
విద్యార్హతలు: బీటెక్‌ / బీఈ / బీఫార్మసీ / బీఆర్క్‌ కోర్సులు లేదా సంబంధిత పేపర్లకు అర్హతగా నిర్దేశించిన బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget