అన్వేషించండి

GATE Halltickets: గేట్-2024 అడ్మిట్ కార్డులు వచ్చేశాయి, ఇలా డౌన్‌‌లోడ్ చేసుకోండి!

GATE 2024: గేట్-2024 పరీక్ష అడ్మిట్ కార్డులు జనవరి 4న విడుదలయ్యాయి. ఐఐఎస్సీ బెంగళూరు హాల్‌టికెట్లను విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.

GATE Admit Cards: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 పరీక్ష అడ్మిట్ కార్డులు (GATE Halltickets) విడుదలయ్యాయి. ఐఐఎస్సీ బెంగళూరు (IISC Bengaloru) హాల్‌టికెట్లను జనవరి 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్ ఐడీతోపాటు పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది 8 లక్షలకు పైగా అభ్యర్థులు గేట్‌ రాయనున్నారు. 

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం  ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఫిబ్రవరి 16న, ఆన్సర్ కీని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. అనంతరం ఆన్సర్ కీపై అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్చి 16న గేట్ ఫలితాలను వెల్లడించనున్నారు. అభ్యర్థులు మార్చి 23 నుంచి గేట్ స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

GATE 2024 Admitcard

30 సబ్జెక్టులకు పరీక్ష..
దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.  'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.

పరీక్ష విధానం..

✦ మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.

✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో (9:30 am - 12:30 pm,  2:30 pm - 5:30 pm.) గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.

✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..

తెలంగాణలో: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.

ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.

Notification

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 KKR VS MI Result Update:  ముంబై ఈజీ విక్ట‌రీ.. సీజ‌న్ లో తొలి విజ‌యాన్ని సాధించిన ఎంఐ.. రికెల్ట‌న్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ
ముంబై ఈజీ విక్ట‌రీ.. సీజ‌న్ లో తొలి విజ‌యాన్ని సాధించిన ఎంఐ.. రికెల్ట‌న్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ
HCU lands Fact: హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ మృతిలో కీలక అప్ డేట్.. విజయవాడలో ఆ 4 గంటలు ఎక్కడున్నారంటే...?
పాస్టర్ ప్రవీణ్ మృతిలో కీలక అప్ డేట్.. విజయవాడలో ఆ 4 గంటలు ఎక్కడున్నారంటే...?
Rains Alert: తెలంగాణకు చల్లని వార్త, మూడు రోజులపాటు వర్షాలు- ఎండల నుంచి ఊరట
తెలంగాణకు చల్లని వార్త, మూడు రోజులపాటు వర్షాలు- ఎండల నుంచి ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs KKR Match Highlights IPL 2025 | కేకేఆర్ ను మట్టి కరిపించిన ముంబై ఇండియన్స్ | ABP DesamDhoni Fan Frustration on Out | RR vs CSK మ్యాచ్ లో వైరల్ గా మారిన క్యూట్ రియాక్షన్ | ABP DesamMS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP DesamSandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 KKR VS MI Result Update:  ముంబై ఈజీ విక్ట‌రీ.. సీజ‌న్ లో తొలి విజ‌యాన్ని సాధించిన ఎంఐ.. రికెల్ట‌న్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ
ముంబై ఈజీ విక్ట‌రీ.. సీజ‌న్ లో తొలి విజ‌యాన్ని సాధించిన ఎంఐ.. రికెల్ట‌న్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ
HCU lands Fact: హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ మృతిలో కీలక అప్ డేట్.. విజయవాడలో ఆ 4 గంటలు ఎక్కడున్నారంటే...?
పాస్టర్ ప్రవీణ్ మృతిలో కీలక అప్ డేట్.. విజయవాడలో ఆ 4 గంటలు ఎక్కడున్నారంటే...?
Rains Alert: తెలంగాణకు చల్లని వార్త, మూడు రోజులపాటు వర్షాలు- ఎండల నుంచి ఊరట
తెలంగాణకు చల్లని వార్త, మూడు రోజులపాటు వర్షాలు- ఎండల నుంచి ఊరట
Akkada Ammayi Ikkada Abbayi Trailer: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!
యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!
Social Exam Date: ఏప్రిల్ 1న యథావిధిగా పదవ తరగతి సోషల్ ఎగ్జామ్
ఏప్రిల్ 1న యథావిధిగా పదవ తరగతి సోషల్ ఎగ్జామ్
KTR about HCU Lands: హెచ్‌సీయూ భూముల కేటాయింపు వల్ల జరిగే నష్టంపై వెంటనే అధ్యయనం చేయాలి: కేటీఆర్
HCU భూముల కేటాయింపు వల్ల జరిగే నష్టంపై వెంటనే అధ్యయనం చేయాలి: కేటీఆర్
Nara Lokesh: అలకలు మాని, పార్టీ కోసం పనిచేయండి- టీడీపీ నేతలకు నారా లోకేష్ క్లాస్
అలకలు మాని, పార్టీ కోసం పనిచేయండి- TDP నేతలకు నారా లోకేష్ క్లాస్
Embed widget