అన్వేషించండి

GATE - 2023 ఫలితాలు రేపే విడుదల! స్కోరుకార్డు ఎప్పటినుంచంటే?

ఫలితాలు వెల్లడి కాగానే.. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా మార్చి 16న విడుదల చేయనుంది.

* మార్చి 16న సాయంత్రం 4 గంటలకు ఫలితాల వెల్లడి

* మార్చి 25 నుంచి స్కోరుకార్డులు అందుబాటులో

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్షను ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. దీంతో మార్చి 16న గేట్-2023 ఫలితాలను వెల్లడించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాలు వెల్లడి కాగానే.. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా మార్చి 16న విడుదల చేయనుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.  అయితే గేట్-2023 స్కోరు కార్డులు మాత్రం మార్చి 21 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు గేట్‌ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.

బ్రాంచ్‌లవారీగా కటాఫ్ మార్కులు ఇలా..

➥ కంప్యూటర్ సైన్స్ (సీఎస్): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-27 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-20 మార్కులు. 

➥ సివిల్ ఇంజినీరింగ్ (సీఈ): జనరల్ ➜ 25-32 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-28 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈ): జనరల్ ➜ 30-36 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 28-32 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 20-25 మార్కులు.

➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఈఈ): జనరల్ ➜ 25-32 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-30 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీ): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-26 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీ): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-26 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు. 

Also Read:

'బయోటెక్నాలజీ'లో పీజీ, జేఆర్‌ఎఫ్ ప్రవేశాలకు నోటిఫికేషన్, పరీక్షలు ఎప్పుడంటే?
బయోటెక్నాలజీ, దాని అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సుల్లో 2023 -24 ప్రవేశాలకు సంబంధించి 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - బయోటెక్నాలజీ (GAT-B) 2023' నోటిఫికేషన్ వెలువడింది. అదేవిధంగా జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే 'బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (BET)-2023' నోటిఫికేషన్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ద్వారా వివిధ విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
ప్రవేశపరీక్షల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం  'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget