అన్వేషించండి

Free Admissions; ప్రైవేట్‌ స్కూళ్లలో 'ఉచిత' ప్రవేశాలకు అవకాశం, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం కింద 2024-2025 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Free Education in Private Schools: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 12(1) (ఈ) 2024-2025 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనాథ, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ కేటగిరీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్‌ 1న మొదటి విడత ఫలితాలు వెల్లడించనున్నారు. ఏప్రిల్‌ 15న రెండో విడత ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన పిల్లలకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఇందులో అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఏపీ గిరిజన సంక్షేమ 'ప్రతిభ' గురుకులాల్లో 8వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థ(ఎస్‌వోఈ/ సీవీఈ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 8వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన గిరిజన బాలబాలికలు మార్చి 25 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రవేశపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 30న విడుదల చేస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ఆధారంగా.. మే 5న అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలచేసి మే 20, 25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
ప్రవేశ వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

ఏపీ గిరిజన గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి రెగ్యులర్ ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన బాలబాలికలు ఏప్రిల్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు స్టేట్‌ సిలబస్‌, ఆంగ్ల మాధ్యమ ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
ప్రవేశ వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు
విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలలు, 14 బీసీ జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), ఇంటర్మీడియట్(ఇంగ్లిష్ మీడియం) మొదటిసంవత్సరంలో ప్రవేశాలకు ఫిబ్రవరి 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/మత్స్యకార) ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Mike Tyson Vs Jake Paul: సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడుభారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Mike Tyson Vs Jake Paul: సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Embed widget