అన్వేషించండి

APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ 'ప్రతిభ' గురుకులాల్లో 8వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు

ఏపీలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థ ఎస్‌వోఈ/ సీవీఈల్లో 8వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది..

APTWREIS (Gurukulam) Admissions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థ(ఎస్‌వోఈ/ సీవీఈ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 8వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన గిరిజన బాలబాలికలు మార్చి 25 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రవేశపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 30న విడుదల చేస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ఆధారంగా.. మే 5న అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలచేసి మే 20, 25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

వివరాలు..

* గిరిజన 'ప్రతిభ' గురుకులాల్లో 8వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు 

విద్యా సంస్థ ప్రదేశాలు:

1) కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (పీజీటీ), మల్లి

2) స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విశాఖపట్నం 

3) స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం (జోగింపేట)

4) కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, విస్సన్నపేట

5) స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీకాళహస్తి

6) స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, శ్రీశైలం డ్యామ్

7) కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, తనకల్లు

సీట్ల సంఖ్య: ఇంటర్ ఎంపీసీలో 300 సీట్లు; ఇంటర్ బైపీసీలో 300 సీట్లు; 8వ తరగతిలో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం ఏడో తరగతి ఉత్తీర్ణులై విద్యార్థులు ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షకాదాయం రూ.లక్షకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ఆధారంగా.

పరీక్ష విధానం...

* ఎనిమిదో తరగతి ప్రవేశపరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో తెలుగు-10 ప్రశ్నలు-10 మార్కులు, ఇంగ్లిష్‌-10 ప్రశ్నలు-10 మార్కులు, హిందీ-10 ప్రశ్నలు-10 మార్కులు, మ్యాథ్స్‌-20 ప్రశ్నలు-20 మార్కులు, ఫిజికల్‌ సైన్స్‌-15 ప్రశ్నలు-15 మార్కులు, బయోసైన్స్‌-15 ప్రశ్నలు-15 మార్కులు, సోషల్‌ స్టడీస్‌-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. ఏడో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు.

* ఇంటర్‌ ప్రవేశపరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పదోతరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌-20 ప్రశ్నలు-20 మార్కులు, మ్యాథ్స్‌-40 ప్రశ్నలు-40 మార్కులు, ఫిజికల్‌ సైన్స్‌-20 ప్రశ్నలు-20 మార్కులు, బయోసైన్స్‌-20 ప్రశ్నలు-20 మార్కులు  సబ్జెక్టు ప్రశ్నలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.03.2024.

➥ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 30.03.2024.

➥ ప్రవేశ పరీక్ష తేది: 07.04.2024.

➥ మెరిట్ జాబితా వెల్లడి: 05.05.2024.

➥ మొదటి దశ కౌన్సెలింగ్ తేది: 20.05.2024.

➥ రెండో దశ కౌన్సెలింగ్ తేది: 25.05.2024.

➥ తరగతులు ప్రారంభం: అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget