Dr.YSRHU: వైఎస్సార్ హార్టికల్చరల్ వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
YSRHU Admissions: పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ కోర్సులకు ఐకార్ ఏఐఈఈఏ (పీజీ)-2023 ర్యాంకు; పీహెచ్‌డీ కోర్సులకు ఐకార్ ఏఐసీఈ జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 24లోగా దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుంది. వెంకటరామన్నగూడెంలోని, అనంతరాజుపేటలోని హార్టికలర్చర్ కళాశాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల వివరాలు..
➥ ఎంఎస్సీ (హార్టికల్చర్)
సీట్ల సంఖ్య: 48.
కోర్సు వ్యవధి: రెండేళ్లు/ నాలుగు సెమిస్టర్లు.
విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్.
అర్హత: బీఎస్సీ(హార్టికల్చర్), బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ అర్హత ఉండాలి.
➥ పీహెచ్‌డీ (హార్టికల్చర్)
సీట్ల సంఖ్య: 21.
కోర్సు వ్యవధి: మూడేళ్లు/ ఆరు సెమిస్టర్లు
విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్.
అర్హత: ఎంఎస్సీ(హార్టికల్చర్), ఎంఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.750 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: పీజీ కోర్సులకు ఐకార్ ఏఐఈఈఏ (పీజీ)-2023 ర్యాంకు; పీహెచ్‌డీ కోర్సులకు ఐకార్ ఏఐసీఈ జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar,
Dr.Y.S.R.Horticultural University
Administrative Office: Venkataramannagudem.
Tadepalligudem – 534 101, West Godavari District, Andhra Pradesh.
ముఖ్యమైన తేదీలు...
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 24.11.2023.
కౌన్సెలింగ్ తేదీలు..
➥ పీజీ కోర్సులకు: 07.12.2023.
➥ పీహెచ్‌డీ కోర్సులకు: 08.12.2023.
ALSO READ:
ములుగు హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు
సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నవంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 స్కోరు సాధించి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 20లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఆలస్యరుసుముతో నవంబరు 22 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం కల్పించారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..