CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, మెరైన్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, 2023 విద్యా సంవత్సరానికి గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, మెరైన్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, 2023 విద్యా సంవత్సరానికి గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్, సైకలాజికల్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు నవంబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ (రెండో బ్యాచ్)
సీట్ల సంఖ్య: 114.
కోర్సు వ్యవధి: 12 నెలలు- రెసిడెన్షియల్.
అర్హత: బీఈ, బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్/ మెకానికల్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజినీరింగ్/ నేవల్ ఆర్కిటెక్చర్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజినీరింగ్/ మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్, సైకలాజికల్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 21.11.2023.
ALSO READ:
టీఐఎఫ్‌ఆర్‌లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేడెట్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్
ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ దేశవ్యాప్తంగా ఉన్న టీఐఎఫ్ఆర్ విభాగాలు/ కేంద్రాలు/ స్కూల్స్‌లో పీహెచ్‌డీ, ఐ-ఐ-పీహెచ్‌డీ, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో 2023-24 విద్యాసంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అక్టోబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీతో పాటు వివిధ బీఎస్సీ పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 19 వరకు అర్హులైన ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిమ్స్ జోధ్‌పుర్‌లో ఎంపీహెచ్ కోర్సు, వివరాలు ఇలా!
జోధ్‌పుర్‌ని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జనవరి 2024 సెషన్ ఎంపీహెచ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..