అన్వేషించండి

CLAT Result 2021: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ - 2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ - 2021 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. క్లాట్ అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

CLAT 2021 Results: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (Common Law Admission Test- CLAT)- 2021 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (సీఎన్ఎల్‌యూ) ఈ ఫలితాలను విడుదల చేసింది. క్లాట్ అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. క్లాట్- 2021 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 30న మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. క్లాట్ పరీక్షకు హాజరైన వారు.. consortiumofnlus.ac.in/clat-2021/ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ దేశవ్యాప్తంగా జూలై 23వ తేదీన క్లాట్ పరీక్షను నిర్వహించింది. దీని ద్వారా గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 82 నగరాల్లోని 147 పరీక్ష కేంద్రాల్లో క్లాట్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు గానూ మొత్తం 70,277 మంది రిజిస్ట్రర్ చేసుకోగా.. 66,887 మంది అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారు. వీరిలో 62,106 మంది పరీక్షలకు హాజరయ్యారు. 

'కీ'పై అభ్యంతరాలు..
క్లాట్ ఎగ్జామినేషన్ ఫైనల్ 'కీ'ని జూలై 27వ తేదీన విడుదల చేశారు. ఈ 'కీ'పై పలు అభ్యంతరాలు వెల్లడయ్యాయి. క్లాట్ పీజీ ఎగ్జామ్ 'కీ'లో మొత్తం 120 ప్రశ్నలు ఉండగా.. 11 ప్రశ్నలపై 24 అభ్యంతరాలు వచ్చాయి. ఇక క్లాట్ యూజీ ఎగ్జామ్ 'కీ'లో 61 ప్రశ్నలకు సంబంధించి దాదాపు 1026 అభ్యంతరాలు వెల్లడయ్యాయి. 
మార్కులు తెలుసుకోండిలా..
1. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.in ను క్లిక్ చేయాలి. 
2. క్లాట్ 2021 డిటైల్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
3. మొబైల్ నంబరు, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. 
4. లాగిన్ అయ్యాక స్క్రీన్ మీద క్లాట్ 2021 స్కోర్ కార్డు కనిపిస్తుంది. 
5. ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 
ఆగస్టు 1న సీట్లు కేటాయింపు..
క్లాట్ ద్వారా సీటు పొందాలనుకున్న అభ్యర్థులు రూ.50000 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశ సీట్ల కేటాయింపు వివరాలను ఆగస్టు 1వ తేదీన విడుదల చేస్తుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు.. తమ సీట్లను ఆగస్టు 5వ తేదీ లోగా కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్లను కన్ఫామ్ చేసుకునేందుకు అభ్యర్థులు ఎన్ఎల్‌యూ (consortiumofnlus.ac.in ) వెబ్ సైట్‌కు వెళ్లి అందులో యాక్సెప్ట్ లేదా లాక్ ద సీట్ అనే ఆప్షన్ ఎంచుకున్నాక.. డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. దీంతో సీట్ కన్ఫామ్ అవుతుంది. ఇక రెండో దశ సీట్ల కేటాయింపు లిస్టును ఆగస్టు 9వ తేదీన, మూడో అలాట్ మెంట్ లిస్టును ఆగస్టు 13న విడుదల చేయనుంది. 
కాగా, గతేడాది క్లాట్- 2020 పరీక్షకు మొత్తం 75,183 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 68,833 మంది అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారు. వీరిలో 86.20 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget