అన్వేషించండి

CIPET: సీపెట్‌ దరఖాస్తు గడువు పెంపు, చివరి తేదీ ఎప్పుడంటే?

టెన్త్ అర్హత ఉన్నవారు మూడేళ్ల డిప్లొమా కోర్సులకు, బీఎస్సీ అర్హత ఉన్నవారు రెండేళ్ల డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఆగస్టు 26 వరకు దరఖాస్తు గడువును పెంచినట్లు సీపెట్‌జాయింట్‌డైరెక్టర్‌సీహెచ్‌శేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి, బీఎస్సీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్లాస్టిక్‌రంగంపై ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 26లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.


పదోతరగతి పూర్తయినవారు మూడేళ్ల కాలపరిమితి గల డిప్లొమా ఇన్‌ప్లాస్టిక్స్‌టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ప్లాస్టిక్స్‌మౌల్డ్‌టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ పూర్తయినవారు రెండేళ్ల కాలపరిమితి గల పీజీ డిప్లొమా ఇన్‌ప్లాస్టిక్స్‌ప్రాసెసింగ్‌అండ్‌టెస్టింగ్‌కోర్సుకు అర్హులన్నారు.

 

కోర్సులకు ఎంపికైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్‌వసతి కల్పిస్తారు. అలాగే క్యాంపస్‌ప్లేస్‌మెంట్‌ద్వారా ప్లాస్టిక్, అనుబంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అందిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు 78935 86494 నంబర్‌ను సంప్రదించవచ్చు.
Website

 

ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, వైయస్‌ఆర్జి ల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP PGCET) - 2022 పరీక్షలను సెప్టెంబరు  3 నుంచి నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 18తో ముగిసింది. ఈ ఏడాది పీజీసెట్ పరీక్షకు మొత్తం 147 సబ్జెక్టులకు గాను 39,359 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సబ్జెక్టులవారీగా దరఖాస్తులు పరిశీలిస్తే.. కెమికల్ సైన్సెస్‌కి 9,899 మంది, లైఫ్ ‌సైన్స్‌కు 5,960 మంది దరఖాస్తు చేసుకున్నారు.

 

Also Read: ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

 

పరీక్షల తేదీలివే..
ఈ ఏడాది సెప్టెంబరు 3, 4, 7, 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో పీజీసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటల వరకు, మూడో సెషన్‌లో సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే దరఖాస్తులు మరీ తక్కువగా వచ్చిన సంస్కృతం, ఉర్దూ, తమిళం, బీఎఫ్‌ఏ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, ఆర్ట్స్, టూరిజం, జియోగ్రఫీ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించడంలేదు. డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా ఆ కోర్సులకు సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.

పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

 

Also Read: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ - ముఖ్యమైన తేదీలు ఇవే!

 

ఆగస్టు 25 నుంచి హాల్‌టికెట్లు...
పీజీసెట్ ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్టుగ్రాడ్యుయేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

AP PGCET 2022 Website

 

Also Read:

CLAT 2023: కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023, దరఖాస్తు చేసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్) - 2023' ప్రవేశ ప్రక‌ట‌న విడుదలైంది. దీనిద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. క్లాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.

✸ కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023

కోర్సులు:

✪ అండ‌ర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
అర్హత‌: క‌నీసం 45 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్‌లో ఇంటర్ ప‌రీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.

✪ పీజీ ప్రోగ్రామ్ (ఎల్ఎల్ఎం డిగ్రీ).
అర్హత‌: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత‌. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో జరిగే లా డిగ్రీ ప‌రీక్షలు రాసేవారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
కోర్సు వ్యవధి: ఏడాది.

ద‌ర‌ఖాస్తు విధానం:
 ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: 
ప్రవేశ పరీక్ష (క్లాట్‌-2023) ద్వారా.

దరఖాస్తు ఫీజు:  ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.3,500, ఇతరులు రూ.4,000 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

క్లాట్‌ పరీక్ష విధానం..


క్లాట్ యూజీ: 

✪ క్లాట్ యూజీ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 150 మార్కులకుగాను 150 ప్రశ్నలకు క్లాట్‌ పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. 
✪ క్లాట్‌ యూజీలో మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగం నుంచి 10శాతం(13–17) , ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 20 శాతం(28–32), లీగల్‌ రీజనింగ్‌ 20 శాతం(35–39), కరెంట్‌ అఫైర్స్‌(జనరల్‌ నాలెడ్జ్‌తో కలిపి) నుంచి 25శాతం(35–39), లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 25శాతం(28–32) ప్రశ్నలు వస్తాయి. 

పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌:

✪ పీజీ(ఎల్‌ఎల్‌ఎం) క్లాట్‌ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలో అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్‌ లా 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇతర లా సబ్జెక్టులు(కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్, ఇంటర్నేషనల్‌ లా, ఎన్విరాన్‌మెంట్, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా, ఐపీఆర్‌ తదితర) నుంచి 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఉన్నత విద్య.. అత్యున్నత అవకాశాలు:

క్లాట్ ద్వారా లా డిగ్రీ పూర్తిచేసిన వారు మాస్టర్స్‌ చేయడానికి విదేశాలకు వెళ్లవచ్చు. కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, సింగపూర్‌ యూనివర్సిటీల్లో లా కోర్సుల్లో చేరడానికి వెళ్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మన దేశంలో పీజీకి సంబంధించి చాలా యూనివర్సిటీలు ఏడాది వ్యవధిగల లా ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్స్‌ పూర్తిచేసిన తర్వాత టీచింగ్‌ ఫ్యాకల్టీగా పనిచేయవచ్చు. న్యాయ విద్య పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలకు కొదవ లేదు. లా కోర్సులు ఉత్తీర్ణులైన తర్వాత లీగల్‌ అడ్వైజర్, అడ్వకేట్, లీగల్‌ మేనేజర్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లాంటి ఉపాధి అవకాశాలు పొందవచ్చు. సివిల్, క్రిమినల్, వినియోగదారుల చట్టాలు, మనవ హక్కులు, పన్నులు, కంపెనీ లా, మేథో సంపత్తి చట్టాలు, రాజ్యాంగం తదితర అంశాల్లో నైపుణ్యాన్ని సంపాదిస్తే.. ఆయా రంగాల్లో వచ్చే కేసుల ద్వారా కెరీర్‌ పరంగా మంచి పేరు, ఆదాయ పరంగా లబ్ధిపొందవచ్చు. ఇక్కడ కేసులు, వాదన అనుభవం ఆధారంగా ఫీజు లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు...

✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.08.2022

✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 13.11.2022.

✦ క్లాట్ ప‌రీక్ష తేది: 18.12.2022 (మ. 2గం. - సా. 4 గం.)

Notification & Application

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India In ICC Champions Trophy Final: ఫైన‌ల్లో భార‌త్.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
అదరగొట్టిన టీమిండియా.. ఫైన‌ల్ చేరిక.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Singer Kalpana Sucide Attempt: బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RS Praveen Kumar Tweet Controversy Sunil Kumar IPS | ఒక్క ట్వీట్ తో తేనె తుట్టను కదిపిన RS ప్రవీణ్Ind vs Aus Match Highlights | Champions Trophy 2025 ఫైనల్ కు చేరుకున్న టీమిండియా | ABP DesamPM Modi inaugurates Vantara | అంబానీల జంతు పరిరక్షణ కేంద్రం 'వంతారా' ను ప్రారంభించిన ప్రధాని మోదీInd vs Aus Semi final Preview | Champions Trophy 2025 లోనైనా ఆసీస్ ఆ రికార్డు బద్ధలు అవుతుందా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India In ICC Champions Trophy Final: ఫైన‌ల్లో భార‌త్.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
అదరగొట్టిన టీమిండియా.. ఫైన‌ల్ చేరిక.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 5 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Singer Kalpana Sucide Attempt: బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
Ind Vs Aus Semi Final Live Score Update: ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
DVV Danayya Daughter Jahnavi: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
KTR : రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ - సారీ చెప్పిన కేటీఆర్
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ - సారీ చెప్పిన కేటీఆర్
Tamannaah Vijay Varma Breakup: విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్... ఆ ఒక్క పనితో అసలు విషయం వెలుగులోకి
విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్... ఆ ఒక్క పనితో అసలు విషయం వెలుగులోకి
Embed widget