CBSE Results: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల మార్కుల షీట్ల కోసం లింక్ ఇదే! డౌన్‌లోడ్ చేసుకోండి!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మే 12న సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మే 12న సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు cbseresults.nic.in లేదా cbse.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 19 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 93.12 శాతంగా ఉందని బోర్డు తెలిపింది. ఇక సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 87.33శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
గతేడాది 94.40శాతంతో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత 1.28శాతం తగ్గింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం, బెంగళూరులో 99.18శాతం, చెన్నైలో 99.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. 1,95,799 మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 44,297 మంది 95శాతం కంటే ఎక్కువ స్కోరు సాధించినట్లు బోర్డు తెలిపింది.
ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5న వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీటిలో పదోతరగతి పరీక్షలకు 21 లక్షల మందికి పైగా విద్యార్థులకు పైగా హాజరు కాగా, 12వ తరగతి బోర్డు పరీక్షలను 16 లక్షల మంది విద్యార్థులకు పైగా హాజరయ్యారు. గతేడాది 12వ తరగతిలో 92.71శాతం, పదోతరగతిలో 94.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు ఈ ఏడాది కూడా టాపర్ల జాబితాను విడుదల చేయడం లేదని సమాచారం.
విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు 12వ తరగతి మాదిరిగానే 10వ తరగతి విద్యార్థులకూ మెరిట్ లిస్ట్‌ను ప్రకటించట్లేదని సీబీఎస్ఈ వెల్లడించింది. మే 16వ తేదీ నుంచి రీ ఎవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
Also Read:
డిగ్రీ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్ వెలువడింది. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం (మే 11) డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల బీఎస్సీ(ఆనర్స్) కోర్సును ప్రవేశ పెడుతున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16 నుంచి జులై 10 వరకు దోస్త్ ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
'దోస్త్' పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
‘సింగిల్ స్పెషల్’ డిగ్రీ! ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి!
ఏపీలోని డిగ్రీ కళాశాలల్లో 'సింగిల్ సబ్జెక్టు' మేజర్‌గా కొత్త కరిక్యులమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డిగ్రీలో మూడు సబ్జెక్టులు ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై ఒక మేజర్ సబ్జెక్టు ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం (మే 10) చైర్మన్ ఫ్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహన్‌రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ‘సెట్స్’ స్పెషల్ ఆఫీసర్ సుధీర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..