అన్వేషించండి

CAT 2023: క్యాట్-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో ప్రవేశాలకు వీలు కల్పించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2023 నోటిఫికేషన్ విడుదలైంది.

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో ప్రవేశాలకు వీలు కల్పించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2023 నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు, ఫెల్లో ప్రోగ్రాముల కోసం (ఎఫ్‌పీఎం) ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 13తో ముగియనుంది. క్యాట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ప్రక్రియ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 26 వరకు ఉంటుంది. నవంబర్ 26న క్యాట్ పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. 2024 జనవరి రెండో వారంలో పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది క్యాట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐఎం లఖ్‌నవూ చేపట్టింది. 

వివరాలు..

* కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2023

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఫైనలియర్ పరీక్షలకు హాజరవుతోన్న విద్యార్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని పేర్కొంది. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1200, మిగతా వారు రూ.2400 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో అర్హత, రిటన్ ఎబులిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను లేదా 18002101088 హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. 

ఐఐఎం క్యాంపస్‌లు ఇవే.. 
క్యాట్ 2023 పరీక్ష ద్వారా విశాఖపట్నం, అహ్మాదాబాద్, బెంగళూరు, కలకతా, జమ్మూ, బోద్ గయ, ఉదయపూర్, తిరుచిరాపల్లి, కోజికాడ్, అమృత్‌సర్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, కాశీపూర్, లక్‌నవూ, రాంచీ, రోహ్‌తక్, షిల్లాంగ్, ఇండోర్, సంబాల్‌పూర్, సిర్‌మౌర్ ఐఐఎం క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. 

CAT 2023 Advertisement

Online Registration

Percentile Score Calculation 2023

Selection Process of IIMs

CAT 2023 Eligibility

CAT 2023 Information Bulletin

CAT 2023 Media Release

Scoring and Equating Process

ALSO READ:

నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఆగస్టు 16 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు గడువు జులై 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు ఆగస్టు 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
Embed widget