అన్వేషించండి

Byjus : ఆఫీసులు ఖాళీ చేస్తున్న బైజూస్ - కాస్ట్ కటింగా ? సంక్షోభం ముదురుతోందా ?

ఖర్చులు తగ్గించుకునేందుకు ఆఫీసుల్ని ఖాళీ చేస్తున్నారు బైజూస్ యజమానులు. అతి కీలకమైన క్యాంపస్‌ల నుంచి ఇప్పటికే ఆఫీసుల్ని తరలించారు.


Byjus :  ఆర్థిక సంక్షోభంలో పడిన బైజూస్ సంస్థ.. కాస్ట్ కటింగ్ వైపు చూస్తోంది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంస్థ .. వేలాది మందిని ఉద్యోగాల నుంచి తప్పించింది. దీంతో ఆఫీసులు కూడా ఖాళీ చేస్తోంది.  బెంగళూరులోని తన కార్యాలయ స్థలాలను ఖాళీ చేస్తోంది. తద్వారా నిధులు మిగుల్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే పలు కార్యాలయాలను ఆ సంస్థ ఖాళీ చేసినట్లు తెలిసింది. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను వేరే కార్యాలయాల్లో సర్దుబాటు చేసింది. కొందరికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని సూచించింది.

బెంగళూరులో కీలక కార్యాలయాలను మూసేసిన బైజూస్                                     

బెంగళూరులో బైజూస్‌కు మూడు ఆఫీసులు ఉన్నాయి.  కల్యాణి టెక్‌ పార్క్‌లో మగ్నోలియా, ఎబోనీ అనే రెండు బిల్డింగ్‌లను బైజూస్ గతంలో లీజుకు తీసుకుంది. ఇందులో మగ్నోలియా బిల్డింగ్‌ మొత్తాన్ని గత నెలలోనే బైజూస్‌ ఖాళీ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే టెక్‌ పార్క్‌లో ఉన్న ఎబోనీ బిల్డింగ్‌కు అక్కడి ఉద్యోగులను తరలించింది. ఎబోనీ బిల్డింగ్‌లోనూ ఇప్పటికే కొంత స్థలాన్ని బైజూస్‌ ఖాళీ చేసిందని, ఆగస్టు కల్లా మొత్తం ఖాళీ చేసే అవకాశం ఉంది.

నెలకు రూ. మూడు కోట్లు ఆదా చేసుకునే లక్ష్యం                                                             

 ప్రెస్టీజ్‌ పార్కులోనూ కొంత భాగాన్ని ఖాళీ చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.   ఖాళీ చేసిన కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కొంతమందిని వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌, ప్రెస్టీజ్‌ టెక్‌ పార్కు, బనేఘట్ట మెయిన్‌ రోడ్డులోని ప్రధాన కార్యాలయాల్లో సర్దుబాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే కొంత మందికి లే ఆఫ్‌లు కూడా ఇచ్చారనిచెబుతున్నారు.  దేశవ్యాప్తంగా 30 లక్షల చదరుపు అడుగుల్లో బైజూస్‌కు కార్యాలయ స్థలం ఉందని, ఇందులో కల్యాణి టెక్‌పార్క్‌లోని 5.58 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని ఖాళీ చేయడం ద్వారా నెలకు రూ. 3 కోట్లు మేర ఆదా చేసుకోవాలన్నది కంపెనీ భావిస్తోంది.   

ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో బైజూస్                                              

తీవ్రమైన కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు బయటపడటంతో కంపెనీ విశ్వసనీయత తగ్గిపోతోంది. ఇటీవల బోర్డు నుంచి ఆడిటర్ డెలాయిట్ తో పాటు  ముగ్గురు బోర్డు సభ్యుల రాజీనామా చేశారు. ఇప్పటికే  FY21 ఆర్థిక ఫలితాలను  దాఖలు చేయడంలో 18 నెలల జాప్యం జరిగింది. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళన  పెంచుతోంది.  పెట్టుబడిదారుల నుండి సుమారు $5 బిలియన్ల నిధులను సేకరించిన బైజూ తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పుడుతోంది. కంపనీ విలువ   $22 బిలియన్ల నుండి $5.1 బిలియన్లకు తగ్గిపోయింది. దీంతో మరిన్నికష్టాలు ప్రారంభమయ్యాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
Telangana SSC Results 2026: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
AP SSC Supplementary Exams 2026: ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే...
ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే...

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 CSK VS MI Result Update: ముంబై ఔట్..! 'ఎల్ క్లాసికో' లో చెన్నై చేతిలో మ‌ళ్లీ ఓట‌మి.. స‌త్తా చాటిన రుతురాజ్, కార్తీక్, కాంభోజ్.. 
ముంబై ఔట్..! ఎల్ క్లాసికో లో చెన్నై చేతిలో మ‌ళ్లీ ఓట‌మి.. స‌త్తా చాటిన రుతురాజ్, కార్తీక్, కాంభోజ్.. 
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
CM Revanth Reddy: వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
Vijayawada Crime News: కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
Viral Video: సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
Kavitha Meet the Press: కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
8 Hour Shift: దీపికా పదుకోన్‌కు హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ కౌంటర్?
దీపికా పదుకోన్‌కు హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ కౌంటర్?
Nani supports Pawan: పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
Embed widget