అన్వేషించండి

APTET July 2024: ఏపీటెట్ జులై - 2024 పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష షెడ్యూలు ఇదే

APTET 2024: ఏపీలో టీచర్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌ పరీక్ష హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

AP TET-2024 Hall tickets: ఏపీలో టీచర్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌ (APTET)- జులై 2024 పరీక్ష హాల్‌టికెట్లను విద్యాశాఖ సెప్టెంబరు 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబరు 3 నుంచి 21 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయారోజుల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలు మాత్రం పరీక్ష నిర్వహించిన మరుసటి రోజు నుంచి అంటే.. అక్టోబర్‌ 4 నుంచి విడుదల చేస్తారు. అక్టోబర్‌ 5 నుంచి కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక అక్టోబర్‌ 27న ఫైనల్ ఆన్సర్ ‘కీ’ విడుదల చేసి, నవంబర్‌ 2న ఫలితాలను ప్రకటించనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 

ఏపీటెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌‌‌లోకి వెళ్లాలి - https://aptet.apcfss.in/
➥ అక్కడ హోమ్‌ పేజీలో APTET JULY - 2024 హాల్‌‌టికెట్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
➥ అభ్యర్థులు లాగిన్‌ కోసం తమ ఐడీతోపాటు, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదుచేయాలి. 
➥ కంప్యూటర్ స్క్రీన్ మీద టెట్ హాల్‌‌టికెట్ కనిపిస్తుంది. డౌన్‌లోడ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఏపీటెట్ జులై - 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

మాక్ టెస్టులు అందుబాటులో..
అభ్యర్థుల సౌలభ్యం కోసం సెప్టెంబర్‌ 19 నుంచి మాక్ టెస్టులను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ ప్రాక్టీస్ టెస్టుల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టు పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి అధికారులు ఏర్పాట్లుచేశారు. మొత్తం 13 మాక్ టెస్టులను కేటగిరీలవారీగా అందుబాటులో ఉంచారు. ఇందులో పేపర్-2ఎ (మ్యాథ్స్), పేపర్-2ఎ (సోషల్), పేపర్-2ఎ (లాంగ్వేజెస్), పేపర్-2బి, పేపర్-1బి, పేపర్-1ఎ ఎస్జీటీ నమూనా పరీక్షలు ఉన్నాయి. 
మాక్ టెస్టుల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం:

➥  ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు.

➥ పేపర్-1 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-1 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ/ఫిజిక్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, కేటగిరీ ఆఫ్ డిజెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి -60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

కేటగిరీలవారీగా అర్హత మార్కులు..
ఏపీ టెట్ పరీక్షలో అర్హత మార్కులను ఓసీ(జనరల్‌) అభ్యర్థులకు- 60 శాతంగా, బీసీ అభ్యర్థులకు- 50 శాతంగా, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.

APTET July 2024 - నోటిఫికేషన్, పరీక్ష సిలబస్, పరీక్ష విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponnavolu : నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన  హైకోర్టు
సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
Samsung Galaxy S24 Offer: శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
Anantapur Court: వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Three Medical Students Washed Away | అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం | ABP DesamChiranjeevi Guinness Book of Records | గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి మెగాస్టార్ చిరంజీవి | ABPRishabh Pant Funny Banter Bangladesh | Ind vs Ban టెస్టులో బంగ్లా పులులకు పంత్ ట్రోలింగ్ తాకిడి |ABPInd vs Ban First Test Result | బంగ్లా పులులను పరుగులుపెట్టించిన చెన్నై చిరుత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponnavolu : నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన  హైకోర్టు
సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
Samsung Galaxy S24 Offer: శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
Anantapur Court: వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
SC Verdict: చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
RRB Notification 2024: ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం - పూర్తి వివరాలివే
ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం - పూర్తి వివరాలివే
Best 7 Seater Car in India: సెవెన్ సీటర్ కార్లలో బెస్ట్ ఇదే - అద్భుతమైన మైలేజీ కూడా!
సెవెన్ సీటర్ కార్లలో బెస్ట్ ఇదే - అద్భుతమైన మైలేజీ కూడా!
Bobbili Simham Movie: బొబ్బిలి సింహానికి 30 ఏళ్ళు... వారసుడు వచ్చిన తర్వాత బాలకృష్ణ తొలి సూపర్ హిట్
బొబ్బిలి సింహానికి 30 ఏళ్ళు... వారసుడు వచ్చిన తర్వాత బాలకృష్ణ తొలి సూపర్ హిట్
Embed widget