అన్వేషించండి

AP EAPCET 2024 Results: ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

AP EAPCET 2024: ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు మంగళవారం (జూన్ 11న) విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఫలితాల్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చారు.

AP EAPCET 2024 Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు మంగళవారం (జూన్ 11న) విడుదలయ్యాయి. విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రామమోహన్ రావు ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

ఎప్‌సెట్ పరీక్షలకు సంబంధించి మోత్తం 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 3.39 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,65,444 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,95,092 మంది అర్హత సాధించారు. మొత్తం 75.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 70,352 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణలైన విద్యార్థుల సంఖ్య 87.11 శాతంగా ఉంది. 

AP EAPCET 2024 Results: ఏపీ ఎప్‌సెట్-2024 ఫలితాలు ఇలా చూసుకోండి..

➨ ఎప్‌సెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
➨ అక్కడ హోంపేజీలో కిందిభాగంలో కనిపించే  AP EAPCET 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి. 

➨ ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎప్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.

➨ ఐసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

➨ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

AP EAMCET Results 2024 (ENG)

AP EAMCET Results 2024 (A & P)

ఏపీ ఎప్‌సెట్-2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి.. (Official Website)

ఈ ఏడాది ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్షను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. ఇందులో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షలు రాశారు. ఇక బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 80,766 (91.12 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే మే 16, 17 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూ కాకినాడ మే 23న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి మే 25న వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించింది. ఇక మే 24న ఇంజినీరింగ్ విభాగానికి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీని, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. ఆన్సర్ ‘కీ’ పై మే 26 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ప్రక్రియ ముగియడంతో తాజాగా ఫలితాల వెల్లడికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.         

ఏపీ ఈఏపీసెట్- 2024 ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు:

➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)

➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ &‌ హెచ్, బీఎఫ్‌ఎస్సీ

➥ బీఫార్మసీ, ఫార్మా-డి.

➥ బీఎస్సీ (నర్సింగ్).

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Jatadhara OTT : సడన్‌గా ఓటీటీలోకి సుధీర్ బాబు 'జటాధర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సడన్‌గా ఓటీటీలోకి సుధీర్ బాబు 'జటాధర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Putin: పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్యం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Embed widget