TSWR: ఎస్సీ పైన్‌ఆర్ట్స్ గురుకులంలో ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎదులాబాద్-ఘట్‌కేసర్‌లోని ఎస్సీ వెల్ఫేర్ ఫైన్‌ఆర్ట్స్ స్కూల్‌లో ఆరోతరగతి కో-ఎడ్యుకేషన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
TSWRFAS - CET 2024 Notification: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, 2024-25 విద్యాసంవత్సరానికి మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎదులాబాద్-ఘట్‌కేసర్‌లోని ఎస్సీ వెల్ఫేర్ ఫైన్‌ఆర్ట్స్ స్కూల్‌లో ఆరోతరగతి కో-ఎడ్యుకేషన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన బాలబాలికలకు చదువుతో పాటు లలిత కళల్లో (ఫైన్‌ఆర్ట్స్) శిక్షణ ఇస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీచేస్తారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 1800-425-45678 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
వివరాలు..
* తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్- ఫైన్ ఆర్ట్స్ స్కూల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్)- 2024
ప్రవేశం: ఆరో తరగతి (స్టేట్ సిలబస్- ఇంగ్లిష్ మీడియం)
సీట్ల సంఖ్య: 80.
సీట్ల కేటాయింపు: ఎస్సీ- 75%, ఎస్సీ- సీసీ- 2%, ఎస్టీ- 6%, బీసీ- 12%, మైనారిటీ- 3%, ఓసీ/ ఈబీసీ- 2% సీట్లు కేటాయించారు.
ఫైన్ ఆర్ట్స్ విభాగాలు:
➥ శాస్త్రీయ సంగీతం- గాత్రం (కర్ణాటక సంగీతం/ హిందుస్థానీ సంగీతం)
➥ వాయిద్య సంగీతం (వీణ/ వయోలిన్ (కర్ణాటక)/ మృదంగం/ తబలా/ కీబోర్డ్/ గిటార్/ ఫ్లూట్)
➥ నృత్యం (కూచిపూడి/ కథక్)
➥ థియేటర్ ఆర్ట్స్
➥ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరం అయిదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత. తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలకు మించకూడదు.
వయోపరిమితి: 01.05.2024 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు. విద్యార్థులు 01.05.2012 - 31.07.2014 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్), రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: ప్రవేశ పరీక్ష (స్టేజ్-1)లో అయిదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), తెలుగు (20 ప్రశ్నలు- 20 మార్కులు), మ్యాథ్స్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), మెంటల్ ఎబిలిటీ (20 ప్రశ్నలు- 20 మార్కులు), ఎన్విరాన్‌మెంటల్/ జనరల్ సైన్స్ (20 ప్రశ్నలు- 20 మార్కులు) సబ్జెక్టుల్లో మొత్తం 100 మార్కులకు ప్రశ్నత్రం ఉంటుంది. సంబంధిత ఫైన్ ఆర్ట్స్ విభాగంలో స్క్రీనింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) 100 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు సమయంలో అవసరమయ్యే సర్టిఫికేట్లు..
➥ క్యాస్ట్ సర్టిఫికేట్
➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్
➥ టీసీ/రికార్డు షీట్ (క్లాస్-V)
➥ స్టడీ సర్టిఫికేట్ (క్లాస్-V)
➥ మార్కుషీట్లు/ప్రోగ్రెస్ కార్డు (క్లాస్-V)
➥ ఆధార్ కార్డు
➥ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (5)
➥ బర్త్ సర్టిఫికేట్
➥ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.04.2024.
➥ హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 26.04.2024.
➥ ప్రవేశ పరీక్ష తేదీ: 05.05.2024.
➥ ఫైన్ ఆర్ట్స్ స్కిల్‌టెస్ట్: 26.05.2024.
➥ ఎంపిక జాబితా తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
➥ స్కిల్‌టెస్ట్ - 2 తేదీ: తర్వాత ప్రకటిస్తారు.