APOSS Results 2022: వెబ్సైట్లో ఓపెన్ టెన్త్, ఇంటర్ మార్కుల మెమోలు!
ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ ఫలితాలపై అభ్యంతరాలు ఉన్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అధికారులు అవకాశం కల్పించారు. విద్యార్థులు సెప్టెంబరు 12 నుంచి 21 వరకు..
ఏపీలో ఓపెన్స్కూల్10వ తరగతి, ఇంటర్సప్లిమెంటరీ ఫలితాలు సెప్టెంబరు 10న విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థుల మార్కుల మెమోలను కూడా అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్ లేదా అడ్మిషన్ నెంబరు నమోదుచేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టులో ఓపెన్ పదోతరగతి, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
పదోతరగతి ఫలితాలు | ఇంటర్ ఫలితాలు
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం..
ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ ఫలితాలపై అభ్యంతరాలు ఉన్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అధికారులు అవకాశం కల్పించారు. విద్యార్థులు సెప్టెంబరు 12 నుంచి 21 వరకు రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ కోసం నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఫీజు ఇలా..
సమాధాన పత్రం రీకౌంటింగ్ కోరువారు టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.200 చెల్లించాలి. అదేవిధంగా రీవెరిఫికేషన్‌తోపాటు సమాధాన పత్రం కాపీ కోరువారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 12 నుంచి 21 వరకు రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
Also Read:
CUET UG Result 2022: సీయూఈటీ యూజీ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
CUET UG Result: దేశంలోని వివిధ ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలు సెప్టెంబర్15వ తేదీలోగా వెలువడుతాయని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. డిగ్రీ కోర్సులకు తొలిసారిగా నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జులైలో ప్రారంభమై ఆగస్టు 30న ముగిశాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సెప్టెంబర్15 నాటికి వెల్లడిస్తుందని, సాధ్యమైతే ఆ తేదీ కన్నా రెండు రోజులు ముందే ప్రకటించే అవకాశం ఉందన్నారు.
గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి దూరవిద్య, సార్వత్రిక, ఆన్‌లైన్ విధానంలో పూర్తిచేసిన డిగ్రీ/పీజీ కోర్సులను రెగ్యులర్ డిగ్రీ/పీజీ కోర్సులతో సమానంగానే పరిగణిస్తామని విశ్వ విద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) తెలిపింది. యూజీసీ రెగ్యులేషన్ 22 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ కార్యదర్శి రజీనీశ్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 259 నగరాల్లో, 489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 6 విడతల్లో కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-2022) నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 15, 16,19, 20; ఆగస్టు 4, 5, 6,7, 8, 10 తేదీల్లో CUET -2022 పరీక్షలు నిర్వహించారు. సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4 నుంచి 6 వరకు వాయిదా పడిన సీయూఈటీ-యూజీ(CUET-UG ) పరీక్షను ఆగస్టు 24, నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ఈ విద్యా సంవత్సరం 12వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు CUET UG 2022 పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ పరీక్ష కోసం దాదాపు 14,90,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.