By: ABP Desam | Updated at : 03 Aug 2022 12:19 AM (IST)
AP 10th Class Supplementary Results ( Image Source : PTI )
ఏపీ 2022 పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఆగస్టు 3న వెలువడనున్నాయి. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది జులై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలను నిర్వహించలేదు.. ఈ ఏడాది జరిగిన పరీక్షలు ప్రభుత్వానికి నిరాశను మిగిలింది. అనుకున్న దానికన్నా కూడా తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం ఇక ముందు అలాంటి తప్పులను జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది.
ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు AP SSC Supplementary Results వెలువడిన అనంతరం https://bse.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో మంత్రి ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చేసుకోవచ్చు.
జులై 6 నుంచి 15 వరకు జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలో దాదాపు 2,01,627ల మంది విద్యార్ధులు హాజరయ్యారు. జులై 6న ఫలితాలను విడుదల చేశారు. నెలరోజుల్లోపే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.
ఇది ఇలా ఉండగా, ఆంధ్రాలో ఈసారి పదోతరగతి ఫలితాల్లో గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు జరిగిన పదో తరగతి రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 6,22,537 విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు హాజరైనవారిలో 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో మొత్తం 67.26 శాతం ఉతీర్ణత నమోదైంది. పదో తరగతి రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 11751 స్కూళ్లకు చెందిన విద్యార్థులు హాజరుకాగా వీటిలో 797 పాఠశాలల్లో నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 71 స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వీరికి జూలై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలను ఆగస్టు 3న విడుదల చేయనున్నారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం:
సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022–ఏప్రిల్ రెగ్యులర్ బ్యాచ్ విద్యార్థులతో సమానంగా పరిగణించనుంది. నిబంధనల ప్రకారం రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్‌లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్ పాస్‌గానే పరిగణిస్తుంటారు.
ఆమేరకు ధ్రువపత్రాలు జారీచేస్తారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు లేక చదువులు కుంటుపడిన విద్యార్థులు టెన్త్ పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైనందున వారికి మేలు చేకూరేలా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే ‘కంపార్టుమెంటల్ పాస్’ను ఈ విద్యాసంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
TS EAMCET 2022 Counselling Schedule: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇవే!
CM Jagan Review : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్, సీఎం జగన్ ఆదేశాలు
TS EAMCET 2022 Toppers: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే!
JEE Advanced 2022 Registration: నేటితో జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుకు ఆఖరు, ఈ సమయం వరకే అవకాశం!
TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!
Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!
Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో