AP SSC Supply Results: ఏపీ పదో తరగతి సప్లిమెంరీ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!
AP SSC Supply Results: ఏపీ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఫలితాలను రిలీజ్ చేశారు.
AP SSC Supply Results: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేశారు. పాఠశాల లాగిన్ లో సంబంధిత విద్యా సంస్థకు చెందిన విద్యార్థుల ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మార్కుల జాబితాను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను రాశారు. జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. జూన్ 2వ తేదీన తెలుగు, 3వ తేదీన హిందీ, 5వ తేదీన ఇంగ్లీష్, 6వ తేదీన గణితం, 7వ తేదీన సైన్స్, 8వ తేదీన సాంఘీక శాస్త్రం పరీక్షలు జరుగాయి. కాంపోజిట్ విద్యార్థులకు పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-1, 10వ తేదీన ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 పరీక్షలు నిర్వహించారు.
వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి: https://results.bse.ap.gov.in/
పదో తరగతి సప్లీ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..!
ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన bse.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
అక్కడ హోమ్ పేజ్‌లో ఏపీ 10Th అడ్వాన్స్డ్ సప్లీమెంటరీ రిజల్ట్స్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.
వెంటనే వేరే పాపప్ ఓపెన్ అవుతుంది.
అందులో మీ పదోతరగతి హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలి.
తర్వాత కింద ఉన్న సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేస్తే రిజల్ట్ ప్రత్యక్షమవుతుంది.
ఆ రిజల్ట్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
మే 6వ తేదీన విడుదలైన పదో తరగతి ఫలితాలు
అమరావతిలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మే 6వ తేదీన ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inలో ఫలితాలను పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 3,349 కేంద్రాల్లో పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించారు. గతేడాది తీవ్ర ఆరోపణలు వచ్చిన వేళ ఈసారి మరింత కఠినంగా వ్యవహరించారు. ఎక్కడా లీక్ సమస్య లేకుండా ఆదేశాలు జారీ చేశారు.