AP 10th Class Results: నేడే ఏపీ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
10th Results: ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను సోమవారం ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
AP Tenth Class Results: ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను సోమవారం ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6.23 లక్షలు, గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు లక్షకుపైగా ఉన్నారు.
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అత్యంత వేగంగా పదోతరగతి పబ్లిక్ పరీక్షల పరీక్షాపత్రాల మూల్యాంకనం పూర్తిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. గతేడాది మే 6న పదోతరగతి పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్రఅసెంబ్లీకి మే 13న ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో.. ఆలోపే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 22న ఫలితాల వెల్లడికి డేట్ ఫిక్స్ చేశారు.
పదోతరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లిష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించగా.. మార్చి 28, 30 తేదీల్లో వొకేషనల్ పరీక్షలు నిర్వహించారు.
గతేడాది 18 రోజుల్లోనే ఫలితాలు..
ఏపీలో గతేడాది పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించారు. ఫలితాలను మే 6న విడుదల చేశారు. అంటే పరీక్షలు ముగిసిన 18 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈసారి మాత్రం 23 రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను అధికారిక వెబ్ సైట్లు bse.ap.gov.in , www.results.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.. దీంతోపాటు వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు.
AP SSC ఫలితాలను ఇలా చూసుకోండి..
➥ విద్యార్థులు ఫలితాల కోసం మొదట BSEAP అధికారిక సైట్‌ని సందర్శించాలి-bse.ap.gov.in.
➥ హోమ్‌పేజీలో అందుబాటులో 'AP SSC 2024 Results' లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదు చేసి, సబ్‌మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ పూర్తయిన తర్వాత మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
➥ ఆ తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
ALSO READ:
తెలంగాణ టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరో 10 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 20తో ముగిసింది. ఫలితాలను డీకోడింగ్ చేయడానికి మరో వారంరోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో 10 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఏప్రిల్ 30న ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఏప్రిల్ 30న కుదరని పక్షంలో మే 1న పదోతరగతి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..