అన్వేషించండి

AP SSC Supply Results: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, మెమో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP 10th Class Results | ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

AP SSC Advanced Supplementary Exam Results | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ (AP 10th Class Supply Results) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ ఏడాది మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ మార్కుల వివరాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఏపీ టెన్త్ సప్లిమెంటరీ మెమో డౌన్‌లోడ్ చేసుకోండి

విద్యార్థులు తమ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ను సందర్శించాలి. అక్కడ హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న SSC Advanced Supplementary Results లింక్‌పై క్లిక్ చేసి, తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత మార్చిలో జరిగిన రెగ్యూలర్ పరీక్షల్లో పాస్ కాలేకపోయిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించింది. 

వాట్సాప్‌లోనూ ఫలితాలు
విద్యాశాఖ బోర్డ్ సర్వర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది కనుక విద్యార్థులకు వాట్సాప్‌లోనూ ఫలితాలు అందిస్తున్నారు. Mana Mitra WhatsApp Governance వాట్సాప్ నెంబర్ 95523 00009 ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 

గత ఏడాది కంటే 6.25 శాతం ఎక్కువ ఉత్తీర్ణత

పరీక్షలకు హాజరైన 94,990 మంది విద్యార్థులలో 78,261 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీని ద్వారా ఈ ఏడాది 82.39% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇది గతేడాది నమోదైన 76.14% కంటే 6.25 శాతం అధికం. ప్రభుత్వం చేపట్టిన '20-రోజుల కార్యాచరణ ప్రణాళిక' విజయాన్ని స్పష్టం చేస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ద్వారా ఎస్ఎస్‌సి పబ్లిక్ పరీక్షల తర్వాత విద్యార్థులకు నిర్దేశిత విద్యాపరమైన మద్దతు, ఇంటెన్సివ్ కోచింగ్, వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని అందించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget