అన్వేషించండి

AP SSC Supplementary Exam Hall Tickets: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

AP Tenth Supplementary Exam Hall Tickets | ఏపీలో మే 25 నుండి జూన్ 4 వరకు జరిగే పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.
  • వాట్సాప్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చు.
  • పదో తరగతి ఫలితాల్లో 85.25% ఉత్తీర్ణత, బాలికలు ముందున్నారు.
  • ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి.

AP 10th Class Supplementary Exams | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (AP SSC Advanced Supplementary) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మే 25వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను పాఠశాలల అధికారిక లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి ప్రకటనలో వెల్లడించారు.

విద్యార్థులు తమ హాల్‌టికెట్లను సులభంగా పొందేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 'మనమిత్ర' వాట్సప్ నంబర్ 95523 00009 ద్వారా విద్యార్థులు నేరుగా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీనితో పాటు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోనూ వీటిని అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు తమ ఎస్ఎస్సీ మార్చి 2026 నాటి పాత రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్లను సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Also Read: టెన్త్ తరవాత ఈ కోర్స్ చేస్తే, విదేశాల్లో కొలువు సంపాదించొచ్చు

ఏపీ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన పదోతరగతి ఫలితాల్లో ఈ ఏడాది మొత్తం 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఉత్తీర్ణత 81.14 శాతంగా ఉండగా, ఈసారి ఫలితాల్లో నాలుగు శాతం వృద్ధి కనిపించింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90 గా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 82.68 గా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. గతేడాది 72.8 శాతంగా ఉన్న ప్రభుత్వ పాఠాశాలల ఉత్తీర్ణత శాతం, ఈసారి ఏకంగా 78.39 శాతానికి పెరగడం విశేషం.

విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం, విద్యాశాఖ ఫలితాలను తెలుసుకోవడానికి పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://results.bse.ap.gov.in ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే, 9552300009 నెంబర్‌కు వాట్సాప్‌లో 'హాయ్' అని మెసేజ్ పంపడం ద్వారా లేదా లీప్ (LEAP) మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.

Also Read: టెన్త్ తరవాత డిప్లొమా కోర్స్‌ చేయొచ్చా, అవకాశాలు ఎలా ఉంటాయ్?

దీనితో పాటు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఓపెన్ స్కూల్ ఫలితాలను https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో లేదా 'మన మిత్ర' వాట్సాప్ నెంబర్ ద్వారా పొందవచ్చని నారా లోకేష్ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Frequently Asked Questions

AP 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?

ఈ పరీక్షలు మే 25వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 4వ తేదీ వరకు జరగనున్నాయి.

AP 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

పాఠశాలల అధికారిక లాగిన్లలో, 'మనమిత్ర' వాట్సప్ నంబర్ 95523 00009 ద్వారా, లేదా ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP 10వ తరగతి ఫలితాల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం ఎంత?

ఈ ఏడాది మొత్తం 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90 గా, బాలుర ఉత్తీర్ణత శాతం 82.68 గా ఉంది.

AP 10వ తరగతి ఫలితాలను ఎలా చెక్ చేసుకోవచ్చు?

అధికారిక వెబ్సైట్ https://results.bse.ap.gov.in ద్వారా, 'మనమిత్ర' వాట్సప్ నంబర్ 9552300009 కు 'హాయ్' అని మెసేజ్ పంపడం ద్వారా, లేదా లీప్ (LEAP) మొబైల్ అప్లికేషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget