News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP PGECET Results: ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీ పీజీఈసెట్-2023' ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీ పీజీఈసెట్-2023' ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మే 28 నుంచి 30 వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు.

అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఐసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ పీజీఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ  పీజీఈసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..

Also Read:

ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల, టాపర్లు వీరే - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీ ఐసెట్ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఈ పరీక్షను నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు. 
ఐసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్ లాసెట్-2023 ఫ‌లితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ లాసెట్/ పీజీ ఎల్‌సెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి సాయంత్రం 4 గంటలకు లాసెట్ ఫలితాలను విడుద‌ల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లాసెట్‌(మూడేళ్ల ఎల్ఎల్‌బీ)లో 78.59 శాతం ఉత్తీర్ణ‌త‌, లాసెట్ (ఐదేండ్ల ఎల్ఎల్‌బీ)లో 80.21 శాత్తం ఉత్తీర్ణ‌త‌, పీజీ ఎల్‌సెట్‌(ఎల్ఎల్ఎం)లో 94.36 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.
లాసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 18న నోటిఫికేషన్‌, ఇతర తేదీలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అన్‌లైన్‌ విధానంలో ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు ప్రవేశాల కోసం జూన్ 19 నుండి 24 వరకు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక జూన్ 21 నుండి 23 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు. తదనంతరం జూన్ 26 నుండి 30 వరకు వెబ్‌ అప్షన్లకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జులై 3న  సీట్లను కేటాయిస్తారు. డిగ్రీ కళాశాలల్లో జులై 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

నిమ్స్‌లో బీఎస్సీ(నర్సింగ్) కోర్సు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) 2023 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌ ఎంసెట్‌-2023లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 15 Jun 2023 06:20 PM (IST) Tags: Education News in Telugu AP PGECET 2023 Results AP PGECET Results AP PGECET 2023 Results 2023

ఇవి కూడా చూడండి

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

AP Inter Fees: ‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?

AP Inter Fees: ‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?

TOSS Results: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు వెల్లడి, ప్రత్యేక ప్రవేశాల గడువు పొడిగింపు

TOSS Results: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు వెల్లడి, ప్రత్యేక ప్రవేశాల గడువు పొడిగింపు

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?