AP ICET Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్, వాట్సాప్‌లోనే ఫలితాలు
AP ICET Results 2025 Direck Link | ఏపీ ఐసెట్ 2025 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వాట్సాప్ నెంబర్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకునే అవకాశం ఉంది.

AP ICET Results 2025 | అమరావతి: ఏపీ ఐసెట్ ఫలితాలు (AP ICET 2025 Results) విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ఏపీ ఐసెట్ ఫలితాలు మంగళవారం సాయంత్రం ప్రకటించారు. ఐసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభిస్తుంది. విద్యార్థులు WhatsApp Governance No. 9552300009 ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు. AP ICET 2025 ఫలితాలు చెక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి
34,131 మంది విద్యార్థులు ఏపీ ఐసెట్ పరీక్షకు హాజరుకాగా, అందులో 32,719 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఏపీ ఐసెట్ పరీక్షకు హాజరైన వారిలో 95.86 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. క్వాలిఫై అయిన విద్యార్థులకు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు.
Congratulations to all the students who qualified in AP ICET 2025!! Results are now available at https://t.co/IQ2oLrRu7D & WhatsApp Governance No. 9552300009.
— Lokesh Nara (@naralokesh) May 20, 2025
32,719 out of 34,131 students qualified (95.86%). My best wishes for your bright academic future!!#APICET2025






















