By: ABP Desam | Updated at : 09 Mar 2023 09:32 AM (IST)
Edited By: omeprakash
ఏపీఐసెట్-2023 షెడ్యూలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి మార్చి 8న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న ఏపీ ఐసెట్-2023 నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో మే 4 నుంచి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 11 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 16, 17 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24, 25 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఏపీ ఐసెట్-2023 షెడ్యూలు :
➽ ఏపీఐసెట్-2023 నోటిఫికేషన్: మార్చి 17న
➽ దరఖాస్తులు స్వీకరణ: మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు.
➽ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: ఏప్రిల్ 20 నుంచి 26 వరకు.
➽ రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు.
➽ రూ.3000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: మే 4 నుంచి 10 వరకు.
➽ రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: మే 11 నుంచి 15 వరకు.
➽పరీక్ష హాల్‌టికెట్లు: మే 20 నుంచి అందుబాటులో.
➽ ఏపీ ఐసెట్ పరీక్ష నిర్వహణ: మే 24, 25 తేదీల్లో.
Also Read:
సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం, పరీక్ష తేదీలివే!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG) 2023 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఎలాంటి మార్పులు లేవని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని ఆశ్రయించి cuet.samarth.ac.in లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) దరఖాస్తు ప్రక్రియ మార్చి 3న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1000 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1000, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్స్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7న ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ.. వారం రోజుల ఆలస్యంగా ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్ రాసిన అభ్యర్ధుులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు మార్చి 12న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
దరఖాస్తు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
TSRJC CET - 2023 దరఖాస్తు గడువు పెంపు, పరీక్ష ఎప్పుడంటే?
Biometric Attendance: ఇక ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 'వేలిముద్ర' పడాల్సిందే! అక్రమార్కుల ఆగడాలకు చెక్!
TSEMR Admissions: ఏకలవ్య గురుకుల ప్రవేశ ప్రకటన విడుదల, పరీక్ష వివరాలు ఇలా!
PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!
AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే!
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు