By: ABP Desam | Updated at : 07 May 2022 09:21 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీ ఎడ్ సెట్ 2022 నోటిఫికేషన్
AP EDCET 2022 : ఏపీ ఎడ్ సెట్ 2022 నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎడ్ సెట్ నోఫికేషన్ ఏపీ ఎడ్‌సెట్ కన్వీనర్ అముదవల్లి శుక్రవారం విడుదల చేశారు. అర్హత పరీక్షకు మే 9 నుంచి జూన్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుజుం ఓసీ అభ్యర్థులకు రూ.650, బీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. ఎడ్ సెట్ పరీక్షను జులై 13న నిర్వహించనున్నారు. బీఈడీ, స్పెషల్ బీఈడీ చేసేందుకు బీఏ లేదా బీఎస్సీ లేదా బీకాం లేదా బీసీఏ లేదా బీబీఎం కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో పాస్ అవ్వాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం cets.apsche.ap.gov.in లో విజిట్ చేయండి.
తెలంగాణ ఎడ్ సెట్
తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ షెడ్యూలు విడుదల చేసినట్లు కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించాలని పేర్కొన్నారు. లేట్ ఫీజు రూ.250తో జులై 1 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. జులై 26, 27 తేదీల్లో తెలంగాణ, ఏపీలో ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ తెలిపారు.
ఎంబీబీఎస్, బీఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులు అనర్హులు
తెలంగాణలో మొత్తం 220 బీఈడీ కాలేజీల్లో 19,600 సీట్లు ఉన్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎడ్‌సెట్ రాసేందుకు అర్హులు అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు సాధిస్తేచాలు. డిగ్రీ, ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చని కన్వీనర్ రామకృష్ణ పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు బీఈడీ చేసేందుకు అనర్హులని వెల్లడించారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://edcet.tsche.ac.in http://www.tsche.ac.in వెబ్‌సైట్‌లను చూడవచ్చు.
Also Read : SBI Recruitment 2022: 35 పోస్టులతో ఎస్‌బీఐ నోటిఫికేషన్- అప్లై చేయడానికి మే 17 లాస్ట్ డేట్
Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు
TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే
Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్‌కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్‌కు కూడా!
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు