SBI Recruitment 2022: 35 పోస్టులతో ఎస్‌బీఐ నోటిఫికేషన్- అప్లై చేయడానికి మే 17 లాస్ట్ డేట్
సిస్టమ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల కోసం SBI నోటిఫికేషన్ జారీ చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లోని 35 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్ 27 ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు గడవు మే 17తో ముగియనుంది.
మే 17వ తేదీలోపు అప్లై చేసుకున్న వాళ్లకు 2022 జూన్ 25న పరీక్ష పెట్టనుంది. ఆన్‌లైన్ పరీక్ష కోసం జూన్ 16 నుంచి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సిస్టమ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్‌లైన్ రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు కాల్ చేస్తారు. అందులో మంచి స్కోర్ సాధించిన వాళ్ల ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తారు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మే 7, 8 తేదీల్లో నాగార్జున యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా
సిస్టమ్ ఆఫీసర్ (టెస్ట్ ఇంజనీర్, వెబ్ డెవలపర్) పోస్టుకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ (150 మార్కులకు), ఇంటర్వ్యూ (25 మార్కులకు) మార్కులను పరిశీలించిన తర్వాత తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు తమ ఇమెయిల్ ఐడీతో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలు ప్రకటించి జాయిన్ అయ్యే వరకు ఈ మెయిల్ ఐడీ యాక్టివ్‌గా ఉండాలి. అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారం, ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ మెయిల్ ఐడీ ద్వారానే జరుగుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా వాడే మెయిల్ ఐడీ ఇస్తేనే మంచిది.
అభ్యర్థులు SBI వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో చివరి తేదీ లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: సైకిల్ వచ్చిన వాళ్లకు కేంద్రం గుడ్ న్యూస్- పరీక్ష లేకుండానే ఉద్యోగం
Also Read: తెలంగాణలో పోలీస్ జాబ్స్‌కు దరఖాస్తులు ప్రారంభం - డైరెక్ట్ లింక్, పోస్టుల అర్హతల వివరాలు ఇవే