News
News
X

ఏపీ ఈసెట్-2023 షెడ్యూలు విడుదల, పరీక్షల తేదీలివే!

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి మార్చి 8న విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి మార్చి 8న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 8న ఏపీఈసెట్-2023 నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 11 నుంచి 15 వరకు. రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 16 నుంచి 19 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 28 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 5న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  

ఏపీ ఈసెట్-2023 షెడ్యూలు: 

🔰 ఏపీఈఏపీ సెట్-2023 నోటిఫికేషన్:  మార్చి 8న 

🔰 దరఖాస్తులు స్వీకరణ: మార్చి 10 నుంచి ఏప్రిల 10 వరకు. 

🔰 రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు: ఏప్రిల్ 11 నుంచి 15 వరకు. 

🔰 రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: ఏప్రిల్ 16 నుంచి 19 వరకు. 

🔰 రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: ఏప్రిల్ 20 నుంచి 24 వరకు. 

🔰 పరీక్ష హాల్‌టికెట్లు: ఏప్రిల్ 28 నుంచి అందుబాటులో. 

🔰 ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహణ: మే 5న.

Also Read:

సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం, పరీక్ష తేదీలివే!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG) 2023 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఎలాంటి మార్పులు లేవని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని ఆశ్రయించి cuet.samarth.ac.in లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

'నిట్‌'లో ఎంసీఏ ప్రవేశానికి 'నిమ్‌సెట్', నోటిఫికేషన్ వెల్లడి!
దేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్‌)లలో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (నిమ్‌సెట్) -2023' నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా... వరంగల్, అగర్తలా, అలహాబాద్, భోపాల్, కాలికట్, దుర్గాపూర్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ప్రవేశాలు ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి నిట్-జంషెడ్‌పూర్ పరీక్ష బాధ్యతలు చేపట్టింది. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్, వరంగల్ రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

TSRJC CET - 2023: టీఎస్​ఆర్జేసీ సెట్​–2023 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్​ మొదటి సంవత్సరం ఇంగ్లిష్​ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​–2023 నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 09 Mar 2023 08:19 AM (IST) Tags: AP ECET 2023 Schedule AP ECET 2023 Dates AP ECET 2023 Notification AP ECET 2023 Application

సంబంధిత కథనాలు

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS EAMCET: టీఎస్ఎంసెట్‌ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!

TS EAMCET: టీఎస్ఎంసెట్‌ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!

TSRJC CET - 2023 దరఖాస్తు గడువు పెంపు, పరీక్ష ఎప్పుడంటే?

TSRJC CET - 2023 దరఖాస్తు గడువు పెంపు, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?