అన్వేషించండి

AP EAPCET 2024: ఏపీఎప్‌సెట్ 2024 దరఖాస్తుల సవరణ ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?

AP EAPCET 2024 Notification: ఏపీలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2024 దరఖాస్తు సవరణ మే 4న ప్రారంభమైంది.

Andhra Pradesh EAPCET 2024 Notification: ఏపీలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2024 దరఖాస్తు సవరణ మే 4న ప్రారంభమైంది. విద్యార్థులు తమ వివరాల్లో ఏమైనా తప్పులుంటే మే 6 వరకు మార్చుకోవచ్చు. మరోవైపు ఏపీ ఎప్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ఆలస్యరుసుములేకుండా ఇప్పటికే ముగిసింది. ఇక రూ.500, రూ.1000 ఆలస్యరుసుముతో కూడా దరఖాస్తు గడువు ముగిసింది. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేకపోయినవారు రూ.5000 ఆలస్యరుసుముతో మే 10 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో మే 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. 

ఏపీ ఎప్‌సెట్ దరఖాస్తు వివరాల సవరణ కోసం క్లిక్ చేయండి..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 16 నుండి 23 వరకు ఏపీ ఈఏపీసెట్ (EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. జేఎన్‌టీయూకే ప్రొఫెసర్ కె.వెంటక రెడ్డి ఏపీఈఏపీసెట్ 2024 కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎప్‌సెట్ ద్వారా 2024 విద్యాసంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

వివరాలు..

* ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ &‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) - 2024 

ప్రవేశాలు కల్పించే కోర్సులు:

➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)

➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ &‌ హెచ్, బీఎఫ్‌ఎస్సీ

➥ బీఫార్మసీ, ఫార్మా-డి.

➥ బీఎస్సీ (నర్సింగ్).

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం ఇంటర్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌లో 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి..

➥ ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2024 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

➥ అగ్రికల్చర్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2024 నాటికి 17- 22 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అగ్రికల్చర్ విభాగాలకు ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాల వరకు (25 సంవత్సరాలు) వయోసడలింపు వర్తిస్తుంది. 

➥  బీఎస్సీ నర్సింగ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 31.12.2024 నాటికి 17- 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అగ్రికల్చర్ విభాగాలకు ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాల వరకు, దివ్యాంగులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

రిజిస్ట్రేషన్ ఫీజు..

➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

➥ రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాలి. ఇక బీసీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు...

➥  నోటిఫికేషన్ వెల్లడి: 11.03.2024. 

➥  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 04.05.2024 to 06.05.2024

➥  రూ.500 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2024.

➥  రూ.1000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.05.2024.

➥  రూ.5000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.05.2024.

➥  రూ.10000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.05.2024.

➥  హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 07.05.2024.

➥ ఏపీ ఈఏపీసెట్ పరీక్ష తేదీలు..

అగ్రికల్చర్ & ఫార్మా కోర్సులకు: 16.05.2024 - 17.05.2024

ఇంజినీరింగ్ విభాగాలకు: 18.05.2024 - 23.05.2024.

Notification

Online Application

Fee Payment for AP EAPCET - 2024

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Embed widget