అన్వేషించండి

AP DEECET Result: ఏపీ డీఈఈసెట్‌-2024 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

AP DEECET – 2024: ఏపీలోని ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ డీఈఈసెట్‌ ఫలితాలు వెలువడ్డాయి.

AP DEECET - 2024 Results: ఏపీలో రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఎడ్) కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన AP DEECET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మే 24న  ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన ఈ పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ మే 29న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP DEECET 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..

Step 1: ఏపీ డీసెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://apdeecet.apcfss.in/

Step 2: అక్కడ హోంపేజీలో కిందిభాగంలో కనిపించే  AP DEECET 2024 ఫలితాల లింక్ మీద క్లిక్ చేయాలి. 

Step 3: ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదు చేయాలి.

Step 4: డీసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

Step 5: ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 

ఏపీ డీఈఈసెట్‌ ర్యాంకు కార్డు కోసం క్లిక్ చేయండి..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి విడత కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఐచ్ఛికాలను జూన్‌ 6 నుంచి 8 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్ల ఆధారంగా మెరిట్ జాబితాను (సీట్ల కేటాయింపు) జూన్ 10న వెల్లడించనున్నారు. సంబంధిత డైట్‌ కళాశాలల్లో జూన్ 12 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. డీఈఈసెట్‌ ర్యాంకు ద్వారా ఏపీలోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలు, ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 

రాష్ట్రవ్యాప్తంగా మే 24న  19 కేంద్రాల్లో ఏపీ డీఈఈసెట్‌ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 4,949 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఈ కోర్సులో సీటు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో మ్యాథమెటిక్స్- 25%, ఫిజికల్ సైన్స్- 25%, బయోలాజికల్ సైన్స్- 25%, సోషల్ స్టడీస్- 25% సీట్లను కేటాయిస్తారు.

పరీక్ష విధానం:
మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 100 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో పార్ట్-ఎ: 60 మార్కులు-60 ప్రశ్నలు, పార్ట్-బి: 40 మార్కులు-40 ప్రశ్నలు అడిగారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఇచ్చారు. పార్ట్-ఎలో టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్, తెలుగు, ఆప్టెడ్ లాంగ్వేజ్ (తెలుగు/తమిళం/ఉర్దూ/ఇంగ్లిష్), మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇక పార్ట్-బిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ/ఎకనామిక్స్/ సివిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

➥ ఏపీ డీఈఈసెట్‌-2024 నోటిఫికేషన్ విడుదల: 22.04.2024. 

➥ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు తేదీలు: 23.04.2024 నుంచి 08.05.2024 వరకు.   

➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీలు: 24.04.2024 నుంచి 09.05.2024 వరకు.  

➥ డీఈఈసెట్ ప‌రీక్ష హాల్‌టిక్కెట్లు విడుద‌ల: 21.05.2024. 

➥ డీఈఈసెట్ ప్రవేశ పరీక్ష తేదీ: 24.05.2024. 

➥ ప‌రీక్ష ఫలితాల వెల్లడి: 30.05.2024. 

➥ మొదటి కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఐచ్ఛికాల న‌మోదు: 06.06.2024 నుంచి 08.06.2024 వరకు. 

➥ సీట్ల కేటాయింపు: 10.06.2024. 

➥ స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ తేదీలు: 12.06.2024 నుంచి 15.06.2024 వరకు.

Notification

Website 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ దాటేసింది!
2015 నుంచి ఇప్పటివరకు కూడా ఇదే మొనగాడి కారు.. ఏకంగా 15 లక్షల మంది కొన్నారు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
Embed widget