అన్వేషించండి

APSET Hallticket: ఏపీసెట్ - 2024 ప్రవేశ పరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే?

AP SET 2024: ఏపీసెట్ పరీక్ష అడ్మిట్‌కార్డులను ఆంధ్ర యూనివర్సిటీ ఏప్రిల్ 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 28న పరీక్ష నిర్వహించనున్నారు.

AP SET 2024 Admitcard: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష(AP SET)-2024కు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఆంధ్ర యూనివర్సిటీ ఏప్రిల్ 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఏపీసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఈమెయిల్‌ ఐడీ/ మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 28న ఏపీసెట్-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 30 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు జిల్లా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ కోసం ఏయూ అధికారులు ఏర్పాట్లు చేశారు.

APSET - 2024 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం: ఏపీ సెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1(జనరల్ పేపర్)లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2(అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు)లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పేపర్-1కు 60 నిమిషాలు (గంట), పేపర్-2కు 120 నిమిషాల (2 గంటల) సమయం కేటాయించారు.

➥ పేపర్-1 పరీక్షను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించనుండగా.. పేపర్-2లో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ సబ్జెక్టులు తప్ప మిగతా సబ్జెక్టులను ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు.

సబ్జెక్టులు: ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్- అట్మాస్పియరిక్‌- ఓషన్ అండ్‌ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 10న ఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 14 వరకు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించింది. ఇక రూ.2000 ఆలస్యరుసుముతో మార్చి 25 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది. పరీక్ష ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1200 చెల్లించారు. బీసీ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు రూ.700 చెల్లించారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 19న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 28న ఏపీసెట్-2024 ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. రూ.5000 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించినవారికి కేవలం విశాఖపట్నం కేంద్రంలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.

కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి.  పీహెచ్‌డీ అర్హత ఉన్నవారు 19.09.1991లోపు మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉంటే దరఖాస్తుకు అర్హులు. 01.06.2002 కు ముందు సెట్/నెట్ పూర్తిచేసినవారికి ఏపీనెట్ నుంచి మినహాయింపు ఉంది. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

Notification

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget