AP EDCET 2024: ఏపీ ఎడ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?
APEDCET: ఏపీలోని బీఈడీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏపీఎడ్‌సెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.
![AP EDCET 2024: ఏపీ ఎడ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే? Andhra University has released APEDCET 2024 Notification application process started check important dates here AP EDCET 2024: ఏపీ ఎడ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/19/8a39f04f0f1965730b8e4fd312c757561713541511837522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP EdCET 2024 Application: ఆంధ్రప్రదేశ్‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 16న 'ఏపీ ఎడ్‌సెట్-2024' నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష బాధ్యత నిర్వహిస్తోంది. ఏపీ ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు మే 15 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి. అయితే రూ.1000ల ఆలస్య రుసుముతో మే 19 వరకు, రూ.2000ల ఆలస్య రుసుముతో మే 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష హాల్‌టికెట్లు మే 30 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 8న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీ జూన్ 15న విడుదల చేస్తారు. ఆ తర్వాత జూన్ 18న సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటు ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేస్తారు.
వివరాలు..
* ఏపీఎడ్‌సెట్ - 2024 (APEdCET-2024)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీఎస్సీ(హోంసైన్స్)/బీకామ్/బీసీఏ/బీబీఎం అర్హత (లేదా) 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ అర్హత ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితిలేదు.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం:
* మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
* పరీక్షలో మొత్తం మూడు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు, పార్ట్-బి: జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు, టెక్నికల్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-సిలో మెథడాలజీ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. మెథడాలజీలో అభ్యర్థులు ఎంపికచేసుకునే సబ్జె్క్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.
* మెథడాలజీలోలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ (జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్), ఇంగ్లిష్ సబ్జె్క్టులు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 16.04.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.04.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.05.2024.
➥ రూ.1000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 19.05.2024.
➥ రూ.2000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 21.05.2024.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 22.05.2024 - 25.05.2024.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 30.05.2024 నుంచి.
➥ ఏపీ ఎడ్‌సెట్-2024 పరీక్ష తేది: 08.06.2024.
పరీక్ష సమయం: మొదటి సెషన్: ఉ.09.00 గం. . ఉ.11.00 గం. వరకు.
➥ ఎడ్‌సెట్ ప్రిలిమినరీ కీ అప్‌లోడ్: 15.06.2024. 11-00 AM
➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 18.06.2024. 5.00 PM
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)