మహిళా శ్రామిక శక్తిలో ఏపీ 'టాప్' - స్కిల్ ఇండియా-2023 నివేదికలో వెల్లడి!
దేశంలోనే అత్యధిక మహిళా శ్రామిక శక్తి ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. స్కిల్ ఇండియా 2023 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ శాతం, ఝార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి.
దేశంలోనే అత్యధిక మహిళా శ్రామిక శక్తి ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. స్కిల్ ఇండియా 2023 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కేవలం మహిళా శ్రామిక శక్తిలోనే కాదు, అత్యధిక నైపుణ్యాలు కలిగిన నిపుణులు ఇంటర్న్‌షిప్ కోరుకుంటూ దరఖాస్తు చేసుకుంటున్నవారి సంఖ్య కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉందని ఈ నివేదిక తేల్చింది. ఇంటర్న్‌షిప్ కోరుతున్నవారు ఏపీలో 93.50 శాతం ఉండగా, ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ 93.22 శాతం, ఝార్ఖండ్ 92.98, కర్ణాటక 91.62 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) భాగస్వామ్యంతో వీబాక్స్ సంస్థ ఆన్‌లైన్ సర్వే జరిపి ఈ నివేదికను రూపొందించింది. మహిళా నైపుణ్య శక్తిలో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి.
ఉన్నత విద్యా విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పుల ఫలితంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులను మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా తయారుచేయగల్గినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా విద్యావిధానంలో నైపుణ్య శిక్షణను కూడా భాగం చేస్తూ, డిగ్రీ పట్టా చేతికందే సమయానికే ఉద్యోగం చేయగలిగే సామర్థ్యంతో యువతను సిద్ధం చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలిపింది.
Also Read:
విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, విదేశాల్లో మాదిరి చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్స్!
విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. వారి తల్లిదండ్రులు ఎంత ధనికులైనా అక్కడి విద్యార్థులకు ఇలా పార్ట్ టైం జాబ్ చేయడం అనేది వారి కరిక్యులమ్‌లో ఓ భాగంగా ఉంటుంది. దీనివల్ల వారికి సంపాదన విలువ తెలియడమే గాక.. ఇండిపెండెంట్‌గా ఉండే స్వభావం అలవాటవుతుందని అక్కడి విద్యాసంస్థలు భావిస్తుంటాయి. ఇప్పుడు మనదేశంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఉన్నత విద్యా సంస్థల్లో 'నేర్చుకుంటూనే సంపాదించండి (EWYL)' పథకం త్వరలో ప్రారంభంకానుంది. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు తమ చదువులను కొనసాగించుకోవడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోగలుగుతారని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తెలిపింది. ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల్లోని వివిధ విభాగాల్లో చేరిన విద్యార్థులకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను కల్పించడానికి సంబంధించిన ప్రతిపాదనలను యూజీసీ రూపొందించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మాతృభాషలో పరీక్షలు రాయనివ్వండి, వర్సిటీలకు యూజీసీ ఛైర్మన్ లేఖ!
ఉన్నత విద్యాసంస్థల్లో మాతృభాషల వినియోగాన్ని ప్రోత్సహించాలని యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులను కోరారు. విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుతున్నప్పటికీ వారికి మాతృభాషలో పరీక్షరాసేందుకు అనుమతివ్వాలని సూచించారు. అలాగే వివిధ భాషల్లో ఉన్న ప్రామాణిక పుస్తకాలను మాతృభాషల్లోకి అనువదించి, యూనివర్సిటీల్లో బోధన, అభ్యాస ప్రక్రియల్లో స్థానికభాషను ఉపయోగించాలని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 19) ఆయన అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు లేఖ రాశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..