![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
AP Inter Supply Results: ఏపీ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
AP Inter Supply Results 2024: ఏపీలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 18 ఉదయం 11 గంటలకు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
![AP Inter Supply Results: ఏపీ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే Andhra Pradesh Board of Intermediate Education apbie has released Inter advanced supplementary exams results 2024 check direct link here AP Inter Supply Results: ఏపీ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/18/1254d512a0c9aa90599134dc4f30953e1718688474330522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Inter Supplementary Results: ఏపీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter Second Year Supplementary Results) మంగళవారం (జూన్ 18) విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను (Inter First Year Supplementary Results) జూన్ 26న వెల్లడించనున్నారు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
Step 1: ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/ సందర్శించాలి.
Step 2: అక్కడ హోంపేజీలో 'ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: అక్కడ వచ్చే లాగిన్ పేజీలో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'Get Result' బటన్ మీద క్లిక్ చేయాలి.
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: విద్యార్థులు రిజల్ట్స్ స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
AP Inter Second Year Supplementary Exams Results Direct Link..
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు ఏప్రిల్ 12న విడుదల చేసింది. ఫలితాలకు సంబంధించి ఇంటర్ జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా చూస్తే.. ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నిర్వహించి ఇటీవలే వాటి ఫలితాలను బోర్డు విడుదల చేసింది.
ఇక ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహించింది. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఒకే రోజు రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,37,587 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మిడియెట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేపట్టారు. జూన్ 18న ఇంటర్ ద్వితీయ సంవత్సరాలు ఫలితాలను వెల్లడించగా.. జూన్ 26న ప్రథమ సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించనుంది.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)