అన్వేషించండి
Advertisement
టెన్త్ విద్యార్థులకు అలర్ట్, గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి - హైదరాబాద్ డీఈవో
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్ 8) హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 8:30 గంటల నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ప్రధాని నరేంద్ర శనివారం (ఏప్రిల్ 8) హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 8:30 గంటల నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా సికింద్రాబాద్ పరిసరాల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వాహనాలకు అనుమతి లేదు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లో మళ్లించనున్నారు.
దీంతో ఉదయం పదో తరగతి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఒక గంట ముందే తమ సెంటర్లకు చేరుకోవాలని హైదరాబాద్ డీఈవో రోహిణి సూచించారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే ఎగ్జామ్‌కు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని డీఈవో సూచించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion