(Source: ECI/ABP News/ABP Majha)
Free Admissions: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలకు సంబంధించి మార్చి 5న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 25లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని
AP Schools: ఏపీలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలకు సంబంధించి మార్చి 5న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ప్రవేశాలు కోరువారు మార్చి 25లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని 'సమగ్ర శిక్షా అభియాన్' రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 9,350 పాఠశాలలు విద్యాహక్కు చట్టం కింద వివరాలు నమోదు చేసుకున్నాయి. వీటిల్లో 25శాతం సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు ప్రవేశాలు కల్పిస్తారు.
అనాథ, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ కేటగిరీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. స్టేట్ సిలబస్ పాఠశాలలో చేరడానికి జూన్ 1 నాటికి విద్యార్థికి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సిలబస్ పాఠశాలల్లో చేరడానికి ఏప్రిల్ 1 నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20లక్షలు, పట్టణాల్లో 1.44 లక్షలు ఉండాలి. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ 18004258599లో సంప్రదించవచ్చు.
ఏప్రిల్ 1న మొదటి విడత ఫలితాలు వెల్లడించనున్నారు. ఏప్రిల్ 15న రెండో విడత ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన పిల్లలకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఇందులో అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ALSO READ:
పదోతరగతి పరీక్షల హాల్‌టిక్కెట్లు వచ్చేశాయ్, డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టిక్కెట్లు మార్చి 4న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమతమ పాఠశాలల లాగిన్ వివరాలతోపాటు.. తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు
విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలలు, 14 బీసీ జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), ఇంటర్మీడియట్(ఇంగ్లిష్ మీడియం) మొదటిసంవత్సరంలో ప్రవేశాలకు ఫిబ్రవరి 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/మత్స్యకార) ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..