News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

JEE(Main) 2022: వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్ 2022 పేపర్‌-2 స్కోరుకార్డు, డౌన్‌లోడ్ చేసుకోండి!

జేఈఈ 2022 సెషన్‌-2 మెయిన్‌ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) జులై 28 నుంచి 30 వరకు నిర్వహించింది.పేపర్‌-2 (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) స్కోరుకార్డును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

జేఈఈ మెయిన్-2022 సెషన్-2 పేపర్‌-2 (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) స్కోరుకార్డును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. స్కోరు కార్డును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ మార్కుల వివరాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేది  వివరాలను నమోదుచేసి స్కోరుకార్డును పొందవచ్చు. 

స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జేఈఈ 2022  సెషన్‌-2 మెయిన్‌ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) జులై 28 నుంచి 30 వరకు నిర్వహించింది. జులై 28, 29 తేదీల్లో పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్ష, జులై 30న పేపర్-2 (బీఆర్క్/బీప్లాన్) పరీక్షలు నిర్వహించింది. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,29,778 మంది విద్యార్థులు పరీక్ష కోసం రిజిస్టర్‌ చేసుకున్నారు. 

అంతకుముందు జేఈఈ మెయిన్​ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన యశ్వంత్, ఏపీకి చెందిన ఆదినారాయణ పి, కే సహాస్, పి రవిశంకర్‌ 100 పర్సంటైల్ సాధించడం విశేషం. 

జేఈఈ మెయిన్‌లో టాప్‌ 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాశారు. ఆగస్టు 28న అడ్వాన్స్‌డ్‌ పేపర్‌–1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, పేపర్‌–2ను మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తుది ఫలితాలను సెప్టెంబర్‌ 11న ప్రకటించనున్నారు.

Also Read:

NMAT 2022: మేనేజ్‌మెంట్‌ కోర్సులకు మెరుగైన మార్గం 'ఎన్‌మాట్', దరఖాస్తు చేసుకోండి!
దేశంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల ప్రవేశాలకు నిర్దేశించిన NMAT-2022 (Narsee Monjee Management Aptitude Test) పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధిస్తే.. మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. NMAT-2022  పరీక్షను గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సెల్ (GMCA) నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా దేశంలోని 68 విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, నైజీరియా, మొరాకో వంటి దేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు కూడా ఈ స్కోరు ఉపయోగపడుతుంది. భారత్‌లో NMIMS  (నర్సీ మోంజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్  స్టడీస్)తోపాటు ముంబయిలోని కె.జె.సోమయ్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, మణిపాల్‌లోని టి.ఏ.పాయ్ మేనేజ్ మెంట్  స్టడీస్ (TAPMI), గీతం తదితర పేరొందిన సంస్థల్లో ఈ స్కోరు ద్వారా ప్రవేశం పొందవచ్చు.

Also Read:
Foreign Education: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఒక్కరోజులోనే వీసా!

బ్రిటన్‌లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి వీసా కష్టాలు గట్టెక్కనున్నాయి. కేవలం ఒక్కరోజులోనే వీసా మంజూరు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేస్తునట్లు.. వీసాలు తొందరగా జారీ చేసేందుకు ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ విధానాలను తీసుకొచ్చినట్లు భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ ప్రకటించారు. ప్రియారిటీ వీసాను అప్లై చేసుకున్న ఐదు రోజుల్లో, సూపర్ ప్రియారిటీ వీసాను దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే పొందవచ్చని వెల్లడించారు. దీని కోసం వీసా ఫీజుతోపాటు అదనఫు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ, చివరి పనిదినం రోజున లేదా సెలవురోజు కంటే ఒక రోజు ముందు సూపర్ ప్రయారిటీ వీసాకు దరఖాస్తు చేసుకుంటే గనుక.. ఆ మరుసటి పనిదినం రోజే వీసాల జారీ ఉంటుంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 04 Sep 2022 01:14 AM (IST) Tags: JEE Main 2022 JEE Main Session 2 Score Card JEE Main Session 2 Result

ఇవి కూడా చూడండి

UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సరికొత్త సిలబస్‌, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి

TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సరికొత్త సిలబస్‌, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి

CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు

CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

LAWCET: లాసెట్‌ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
×