News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Woman Kills Husband: లవర్‌తో కలిసి భర్తను దారుణంగా చంపిన మహిళ, అఫైర్ గురించి తెలిసిందని హత్య

Woman Kills Husband: వివాహేతర సంబంధం గురించి తెలిసిందన్న భయంతో ఓ మహిళ తన భర్తను లవర్‌తో కలిసి హత్య చేసింది.

FOLLOW US: 
Share:

Woman Kills Husband:

యూపీలో ఘటన..

యూపీలో దారుణ హత్య జరిగింది. ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను కిరాతకంగా చంపేసింది. ఆ తరవతా ఆ డెడ్‌బాడీని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసింది. మండల్ గ్రామంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఆ మహిళను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. జూన్ 6వ తేదీ నుంచి సాగర్ (మృతుడు) కనిపించకుండా పోయాడు. మిస్ అయ్యాడుకున్న వ్యక్తి సెప్టిక్ ట్యాంక్‌లో శవంలా కనిపించాడు. వెంటనే భార్యను విచారించడం మొదలు పెట్టారు పోలీసులు. నిందితురులా అశియా నేరాన్ని అంగీకరించింది. లవర్‌తో కలిసి భర్తను హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్టు వివరించింది. వివాహేతర సంబంధం గురించి తన భర్తకు తెలిసిపోయిందని, అందుకే ఇద్దరం కలిసి చంపేశామని చెప్పింది. ఈ స్టేట్‌మెంట్‌ని రిజిస్టర్ చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. జూన్ 6వ తేదీన హత్య చేసి...నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో బాడీని పడేశారు. ఈ హత్య చేసిన తరవాత కూడా అదే ఇంట్లో ఉంది ఆ మహిళ. జూన్ 9వ తేదీన పోలీసులు ఆ శవాన్ని గుర్తించి బయటకు తీశారు. సాగర్‌ మిస్ అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా...ఇదంతా బయట పడింది. 

వరుస హత్యలు..

ఢిల్లీలోని ఫరియాబాద్‌లో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తి మహిళను ఓయో హోటల్‌లోనే హత్య చేశాడు. తనతో కాకుండా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న కక్షతో హోటల్‌ రూమ్‌లో హతమార్చాడు 24 ఏళ్ల యువకుడు. ఢిల్లీలోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న ఆకాశ్...ఓ మహిళతో దాదాపు 8 ఏళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే..ఈ మధ్య తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని, వేరే వ్యక్తికి దగ్గరవుతుందన్న అనుమానంతో హోటల్‌కి పిలిచి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఫరియాబాద్‌లోని NHPC చౌక్ వద్ద ఓయో హోటల్‌కి రావాలని ఆ మహిళకు చెప్పాడు. రూమ్‌లోనే ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. ఆవేశంతో ఊగిపోయిన ఆకాష్..తాడుతో ఉరి బిగించి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్‌లో ఉన్న నిందితుడుని అరెస్ట్ చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మహిళను చంపేందుకు వినియోగించిన తాడునీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మర్డర్ కేస్ నమోదు చేసి...రిమాండ్‌లోకి తీసుకున్నారు. కేసుని విచారించిన తరవాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ముంబయిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళను ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం...డెడ్‌బాడీని ముక్కలు చేయడమే కాదు. వాటిలో కొన్ని భాగాల్ని కుక్కర్‌లో వేసి ఉడికించాడు. మరి కొన్ని అవయవాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. తలుచుకుంటేనే ఒళ్లు వణికిపోయేంత పాశవికంగా ప్రవర్తించాడు. ఇంటిని సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

Also Read: Manipur Violence: మణిపూర్‌లో ఆగని అల్లర్లు, కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి

Published at : 16 Jun 2023 12:29 PM (IST) Tags: Illegal Affair extra marital affair UP Crime News woman kills husband Uttar Pradesh

ఇవి కూడా చూడండి

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Hyderabad:  హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

స్పా సెంటర్ వద్ద మహిళపై దాడి, బట్టలు చింపేసి జుట్టు పట్టుకుని లాగి - వీడియో వైరల్

స్పా సెంటర్ వద్ద మహిళపై దాడి, బట్టలు చింపేసి జుట్టు పట్టుకుని లాగి - వీడియో వైరల్

టాప్ స్టోరీస్

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు