Woman Punches Husband: బర్త్‌డేకి దుబాయ్‌కి తీసుకెళ్లలేదని భర్తతో గొడవ, ముక్కుపై బలంగా గుద్ది చంపిన భార్య
Pune Crime News: బర్త్‌డేకి దుబాయ్‌కి తీసుకెళ్లలేదని ఓ భార్య భర్తను ముక్కపై గుద్ది చంపింది.
Pune Crime:
పుణేలో ఘటన..
బర్త్‌డేకి దుబాయ్‌కి తీసుకెళ్లేందుకు ఒప్పుకోలేదని భర్తను హత్య చేసిందో భార్య. ముక్కు మీద బలంగా గుద్దడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. పుణెలోని వనవడి ఏరియాలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు నిఖిల్ ఖన్నా. కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో బిజినెస్‌మేన్. ఆరేళ్ల క్రితం రేణుక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బర్త్‌డే సెలబ్రేషన్స్ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన రేణుక...భర్త ముఖంపై గట్టిగా గుద్దింది. ఈ ధాటికి నిఖిల్ ప్రాణాలు కోల్పోయాడు. పళ్లు విరిగిపోయి తీవ్ర రక్తస్రావమైనట్టు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
"ఈ ఘటన నవంబర్ 24న మధ్యాహ్నం జరిగింది. ప్రాథమిక విచారణ చేపట్టాం. రేణుక, నిఖిల్ మధ్య వాగ్వాదం జరిగింది. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి దుబాయ్‌కి తీసుకెళ్లాలని రేణుక పట్టుబట్టింది. అందుకు నిఖిల్ ఒప్పుకోలేదు. ఈ విషయంలోనే గొడవైంది. అంతే కాదు. ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వలేదనీ రేణుక గొడవ పెట్టుకుంది. తన బంధువుల బర్త్‌డేలనూ సెలబ్రేట్ చేయలేదని అప్పటికే రేణుక చాలా కోపంతో ఉంది. ఈ గొడవలోనే రేణుక నిఖిల్ ముఖంపై గట్టిగా గుద్దింది. ఆ దెబ్బ ధాటికి పళ్లు విరిగిపోయాయి. విపరీతంగా రక్తస్రావమైంది. నిఖిల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తరవాత మృతి చెందాడు"
- పోలీసులు
Also Read: ఒక్క గంటలో 29 మందిని కరిచిన కుక్క, రాళ్లతో దారుణంగా కొట్టి చంపిన స్థానికులు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply